Bilkis Bano : బిల్కిస్ బానో అప్పీలు తోసిపుచ్చిన సుప్రీంకోర్టు-11 రేపిస్టుల విడుదల కరెక్టే !
2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో సామూహిక అత్యాచారానికి గురై, కన్న కూతురు సహా ఏడుగురు కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన బిల్కిస్ బానో .. ఈ కేసులో 11 మంది దోషుల్ని విడుదల చేస్తూ గుజరాత్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ ఆమె విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
सुप्रीम कोर्ट ने बिलक़िस बानो की अर्ज़ी ख़ारिज कर दी। बिलक़िस बानो का 21 साल की उम्र में गैंग रेप किया गया, उसके 3 साल के बेटे & 6 परिवार वालों का क़त्ल कर दिया गया, पर गुजरात सरकार ने उसके सभी रेपिस्ट को आज़ाद कर दिया। अगर सुप्रीम कोर्ट से भी न्याय नहीं मिलेगा, तो कहाँ जाएँगे?
— Swati Maliwal (@SwatiJaiHind) December 17, 2022
2002లో తనపై అత్యాచారం చేసి, కుటుంబ సభ్యుల్ని హతమార్చిన 11 మంది హంతకుల్ని గుజరాత్ ప్రభుత్వం వారికి విధించిన యావజ్జీవ కారాగారశిక్ష పూర్తి కాకుండానే విడుదల చేయడాన్ని బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే ఆమె విజ్ఞప్తిని సుప్రీంకోర్టు అంగీకరించలేదు. 2008లో వీరందరికీ యావజ్జీవ జైలుశిక్ష విధిస్తూ న్యాయస్ధానం ఇచ్చిన తీర్పు ప్రకారం వారు కనీసం 14 ఏళ్లు జైలు జీవితం గడపాల్సి ఉంది. కానీ వారిని గుజరాత్ ప్రభుత్వం కేంద్రం చెప్పిందంటూ ఆగస్టు 15న సత్ప్రవర్తన పేరుతో విడుదల చేసింది.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మలివాల్ తప్పుబట్టారు. 21 ఏళ్ల వయసులో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిపి పాపను కూడా పొట్టనబెట్టుకున్న వారిని గుజరాత్ ప్రభుత్వం ముందే విడుదల చేసిందని, దీనిపై సుప్రీంకోర్టులో కూడా ఆమెకు న్యాయం జరగకపోతే ఆమె ఎక్కడికి వెళుతుందని స్వాతి మలివాల్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా పలు సామాజిక ఉద్యమకారులు, స్వచ్ఛంద సంస్ధలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications