ఐ యామ్ వెయిటింగ్, బయోకాన్ చీఫ్ కిరణ్ మంజుదార్ షా, బడ్జెట్ 2020ను క్యాన్సర్ తో పోలుస్తూ ట్వీట్!

న్యూఢిల్లీ: కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం 2020- 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ ఆవిష్కరించింది. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ రెండోసారి బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టి తనదైన శైలిలో ప్రసంగంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సమమంలో బయోకాన్ చీఫ్, పారిశ్రామిక దిగ్గజం కిరణ్ మంజుదార్ షా ఆసక్తికర ట్వీట్ చేశారు. తాను బడ్జెట్ 2020-01 వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచుస్తున్నానని, ఐయామ్ వెయిటింగ్ అంటూ బడ్జెట్ ను క్యాన్సర్ తో పోలుస్తూ కిరణ్ మంజుదార్ షా ఆసక్తికర ట్వీట్ చేశారు.

భారీ అంచనాలు

భారీ అంచనాలు

కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2020- 01 బడ్జెట్ పై తాను భారీ అంచనాలు పెట్టుకున్నానని బయోకాన్ చీఫ్ కిరణ్ మంజుదార్ షా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఓ మహిళ (నిర్మలా సీతారామన్) వరుసగా రెండోసారి బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారని, ఆ బడ్జెట్ పూర్తి వివరాలు తెలుసుకోవాలని తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆమె ట్వీట్ చేశారు.

బడ్జెట్ ను క్యాన్సర్ తో పోలుస్తూ ట్వీట్!

ఆర్థిక వ్యవస్థను క్యాన్సర్ తో పోలుస్తూ వైద్య పరిభాషలో బయోకాన్ చీఫ్ కిరణ్ మంజుదార్ షా ఆసక్తికర ట్వీట్ చేశారు. మన ఆర్థిక వ్యవస్థకు కీమోథెరఫీ కాదు ఇమ్యూనోథెరఫీ కావాలని, మనం గాయాల గురించి కాదు, దానికి కారణం అయిన వాటి గురించి ఆలోచించాలని కిరణ్ మంజుదార్ షా ట్వీట్ చేశారు.

కేంద్ర మంత్రి నిర్మలా ఏం చెబుతారో?

కేంద్ర మంత్రి నిర్మలా ఏం చెబుతారో?

బడ్జెట్ 2020-01 పై విధానాన్ని కలిగి ఉంటుందని తాను ఆశిస్తున్నానని కిరణ్ మంజుదార్ షా అభిప్రాయం వ్యక్తం చేశారు. మన ఆర్థిక నిరోధక వ్యవస్థలో సంపద సృష్టి అనేది చాలా కీలకమైనదని కిరణ్ మంజుదార్ షా అన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏం చెబుతారో ? అంటూ తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని కిరణ్ మంజుదార్ షా ట్వీట్ చేశారు.

బయోకాన్ చీఫ్ ఎందుకు ఇలా ట్వీట్?

బయోకాన్ చీఫ్ ఎందుకు ఇలా ట్వీట్?

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2020- 01 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన సమయంలో బయోకాన్ చీఫ్ కిరణ్ మంజుదార్ షా ఆసక్తికర ట్వీట్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. బయోకాన్ చీఫ్ కిరణ్ మంజుదార్ షా ట్వీట్ చేసిన తరువాత ఈ విషయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+