కేరళ నన్ రేప్ కేసు: బిషప్ ఫ్రాంకో ములక్కల్ అరెస్ట్
తిరువనంతపురం: కేరళ నన్‌పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో జలంధర్ చర్చ్ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను కేరళ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఓ నన్‌పై లైంగిక దాడికి పాల్పడి అరెస్ట్ అయిన తొలి భారతీయ కాథలిక్ బిషప్ ములక్కల్.
కొచ్చిలో శుక్రవారం సాయంత్రం బిషప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అధికారికంగా ప్రకటించనున్నారు. ఫ్రాంకో ములక్కల్ జలంధర్ చర్చ్ కేరళలో నిర్వహిస్తున్న స్కూళ్ల పర్యవేక్షణకు వచ్చిన సందర్భంగా నన్‌పై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.

2014 నుంచి 2016 వరకూ ములక్కల్ తనపై 13 సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని కేరళ నన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా, తనపై లైంగిక దాడి ఆరోపణలు వచ్చిన క్రమంలో పాస్టర్ బాధ్యతల నుంచి తప్పించాలని పోప్‌కు ములక్కల్ లేఖ రాసిన క్రమంలో ఆయన స్ధానంలో మరొకరికి బాధ్యతలు అప్పగిస్తూ వాటికన్ నుంచి అధికారిక సమాచారం అందిందని చర్చి వర్గాలు తెలిపాయి.
బిషప్‌ను అరెస్ట్ చేసే ముందు ఆయనపై లైంగిక దాడి ఆరోపణలు చేసిన బాధితురాలి నుంచి తాజా స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. మూడు రోజుల కిందట కేసుకు సంబంధించి ములక్కల్‌ను పోలీసు అధికారులతో కూడిన సిట్ బృందం ప్రశ్నించింది. మూడురోజులపాటు ప్రశ్నించిన అనంతరం ములక్కల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
-
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!!












Click it and Unblock the Notifications