Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video : 2020లో మరో ఘోరం.. సిగరెట్ తాగుతున్న పీత... గుప్పుగుప్పమని పొగ వదులుతూ...

కరోనా వైరస్... మిడతల దండు... పలువురు ప్రముఖుల మరణాలు... ఇలా 2020లో ఇప్పటిదాకా ఎన్నో ఘోరాలు చూశాం. ఇవి చాలదన్నట్లు ఇప్పుడు ఇంకో ఘోరం కూడా చూడాల్సి వస్తోంది. అచ్చు మనుషుల్లాగే ఓ పీత సిగరెట్ తాగుతూ గుప్పు గుప్పుమని పొగ వదలుతోంది. బీచ్‌లో ఎవరో తాగి పడేసిన సిగరెట్ పీకను నోట్లో పెట్టుకుని పొగ రాయుడిలా పోజు కొడుతున్న ఆ పీత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

షారుఖ్ ఇనామ్ అనే ఓ నెటిజన్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. '2020లో మరో ఘోరం... సిగరెట్ తాగుతున్న పీత...' అని దానికి క్యాప్షన్ పెట్టాడు. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద కూడా ఈ వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. 'ఇదో పీడ కల లాంటిది. మనం వాడి పడేసే వ్యర్థాలను ఇలా పీతలు పట్టుకెళ్తున్నాయి. మన తీరుతో పర్యావరణాన్ని కూడా నాశనం చేస్తున్నాం.' అని ఆ అధికారి పేర్కొన్నారు.

bizzare Video of crab smoking cigarette goes viral, sparks outrage

అంతేకాదు,క్యాన్సర్ 'క్యాన్సర్ పఫ్‌'(క్యాన్సర్‌కి దారితీసే ధూమపానం) చేస్తోందని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఇంగ్లీష్‌లో క్యాన్సర్ అంటే కర్కాటక రాశి అన్న సంగతి తెలిసిందే. దాని చిహ్నం పీత. అందుకే పీత సిగరెట్ తాగుతుందన్న విషయాన్ని అలా వ్యంగ్యంగా చెప్పారు.

మరో నెటిజెన్ దీనిపై స్పందిస్తూ... ఎవరో కావాలనే ఇలా చేశారనిపిస్తోందని కామెంట్ చేశాడు. పీతతో సరదా చూడటం కోసం కావాలనే సిగరెట్ పీకను దానికి విసిరి ఉంటారని అన్నాడు. ఏదేమైనా ఇలాంటి ధోరణి సరికాదని... ఆ సీన్ చూసేందుకు మనసు ఒప్పుకోవట్లేదని అన్నాడు.

Recommended Video

    Buying A Loose Cigarette Is Risky. Here's Why? || Oneindia Telugu

    మాసన్ మరో నెటిజన్ స్పందిస్తూ... 'మీరు ఒకవేళ సిగరెట్ తాగితే... వాటి పీకలను ఎక్కడపడితే అక్కడ పడేయకండి. గతంలో ఇలాగే ఓ తల్లి పక్షి పిల్ల పక్షి నోటికి సిగరెట్ పీకను అందించింది. కనీసం ఇప్పుడైనా మనం మన బీచ్‌లను శుభ్రంగా ఉంచుకుందాం. పీతల లాంటి జీవులను యాష్ ట్రేలుగా ఉపయోగించుకోవడం ఇకనైనా మానండి.' అని కాస్త ఘాటుగానే చెప్పాడు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+