రాహుల్ గాంధీపై బీజేపీ సంచలన ఫిర్యాదు -ఎన్నికల ప్రచారాన్ని నిరోధించాలంటూ ఈసీకి వినతి

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ చేస్తోన్న విస్తృత ప్రచారానికి విశేష ఆదరణ లభిస్తోన్న తరుణంలో బీజేపీ సంచలన ఫిర్యాదు చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొనకుండా నిరోధించాలని ఎన్నికల కమిషన్‌(ఈసీ)ని బీజేపీ కోరింది.

తమిళనాడు పర్యటలో రాహుల్.. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని, మరొక స్వాతంత్ర్య పోరాటం చేయాలంటూ యువతను రెచ్చగొడుతున్నారని, ఇందుకుగానూ ఆయనపై కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని ఈసీని బీజేపీ కోరింది. ఈ మేరకు.. తమిళనాడు బీజేపీ ఎలక్షన్ కమిటీ ఇన్‌ఛార్జి వీ బాలచంద్రన్ గురువారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) సత్యబ్రత సాహూకు ఓ వినతిపత్రం సమర్పించారు.

 BJP asks EC to stop congress leader Rahul Gandhi from campaigning in Tamil Nadu

మార్చి 1న కన్యాకుమారి జిల్లా, ములగుమూడులోని ఓ పాఠశాలలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం ముమ్మాటికీ ఎన్నికల ప్రచారమే అని, విద్యా సంస్థల ప్రాంగణాల్లో ప్రచారం నిర్వహించడం నిబంధనల ఉల్లంఘనే అవుతుందని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ ప్రచారం చేయకుండా నిరోధించాలని బీజేపీ కోరింది.

నాటి కార్యక్రమంలో రాహుల్ గాంధీ.. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశానికి ఇప్పుడు మరొక స్వాతంత్ర్య సంగ్రామం అవసరమని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు ఐపీసీ సెక్షన్ 109 (పురిగొలిపినందుకు శిక్ష), సెక్షన్ 124ఏ (దేశద్రోహం) ప్రకారం నేరమని, దేశంలో ప్రస్తుత పరిస్థితులను బ్రిటిష్ పరిపాలనా కాలంతో పోల్చారని, మరొక స్వాతంత్ర్య పోరాటానికి యువతను రెచ్చగొట్టారని బీజేపీ తన ఫిర్యాదులో పేర్కొంది.

విద్వేషాన్ని పెంచడంతోపాటు, ప్రభుత్వంపై అసమ్మతిని రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై ఈసీ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సిఉంది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఎన్నికలు జరుగనున్నాయి. మే 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుండగా, అన్నాడీఎంకే, బీజేపీలు ఒకటిగా బరిలో నిలిచాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+