వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొత్తు ఫైనలైన శివసేన మారలేదు : గోవా విషయంలో బీజేపీని కడిగేసింది

|
Google Oneindia TeluguNews

ముంబై : ఎన్డీఏ భాగస్వామ్య పక్షం శివసేన .. బీజేపీ వైఖరిని మరోసారి తప్పుపట్టింది. గోవా సీఎం మనోహర్ పారికర్ ఛితాభస్మం చల్లారకముందే బీజేపీ సీఎం కుర్చీ కోసం రాజకీయాలు చేసిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. 'ప్రజాస్వామ్యంలో ఓ రాష్ట్రం గడ్డు పరిస్థితికి ఇది నిదర్శనం' అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. పారికర్ అస్తికలు బూడిదై ... చల్లారే వరకు కూడా ఆ పార్టీ నేతల ఆగకుండా .. రిసార్టు రాజకీయాలకు తెరతీసి, తమ నైజాన్ని నిరూపించున్నారని మండిపడింది.

ప్రియాంకా గాంధీ పై స్మృతీ ఇరానీ ఫైర్.. మాజీ ప్రధాని శాస్త్రిని ప్రియాంక అవమానించారటప్రియాంకా గాంధీ పై స్మృతీ ఇరానీ ఫైర్.. మాజీ ప్రధాని శాస్త్రిని ప్రియాంక అవమానించారట

అధికారం కోసం వికృత క్రీడలు

అధికారం కోసం వికృత క్రీడలు

ప్రజాస్వామ్యంలో అధికారం కోసం పార్టీలు పాటుపడాలి. కానీ పారికర్ మరణించాక బీజేపీ చేసిన చర్యలు అధికారం కోసం వికృత క్రీడ ఆడినట్టు ఉందని విమర్శించింది. పారికర్ ఛితాభస్మం భూమిలో ఇంకి పోకముందే బీజేపీ చేసిన చర్య హేయనీయమని తన పార్టీ పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పారికర్ మృతి తర్వాత ఆయన సేవలను స్మరించుకోవాల్సిన బీజేపీ నేతలు .. కనీసం మంగళవారం కూడా ఆగలేదని తప్పుపట్టింది. ఈ ప్రక్రియలో బీజేపీ రెండురోజులు ఆగితే సరిపోయేదని గుర్తుచేసింది. అలా చేస్తే బీజేపీ నేతలు కాంగ్రెస్‌లో చేరేవారా అని ప్రశ్నించింది.

ఎంపిక వెనుక కథ ..?

ఎంపిక వెనుక కథ ..?

సీఎంగా ప్రమోద్ సావంత్, డిప్యూటీ సీఎంలుగా విజయ్ సర్దేశాయ్, సుదీన్ దావలికర్ సోమవారం అర్ధరాత్రి ప్రమాణం చేయడంలో ఆంతర్యం ఏంటని నిలదీసింది. వీరిద్దరూ నేతలకు కాంగ్రెస్ పదవులు ఇస్తామని మభ్యపెడుతోందని అనుమానించి .. వికృత క్రీడకు తెరతీసిందని ఫైరయ్యింది. అంతకుముందు పిల్లి, ఎలుకలాగా దాడుగుమూతలు ఆడి .. చివరికి రాత్రి అభ్యర్థులను కన్ఫామ్ చేశారని ఎద్దేవా చేసింది. కానీ గోవా ప్రజలు సర్దేశాయ్, సుదీన్‌‌లను డిప్యూటీ సీఎంలుగా భావించడం లేదని, వారిని నియమించే ప్రక్రియేలో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని పేర్కొన్నది.

అంతా ఊబలాటం ఎందుకు ?

అంతా ఊబలాటం ఎందుకు ?

గోవాలో బీజేపీ సభ్యులు తక్కువ ఉన్నా .. ఎంజీపీ, జీఎఫ్పీ సహా ఇండిపెండెంట్ల మద్దతు ఆ పార్టీకే ఉంది. అయితే సోమవారం అర్ధరాత్రే ప్రమాణ స్వీకారం తంతు నిర్వహించడంలో ఆంతర్యం ఏంటీ ? పారికర్ ఆస్తికలు బూడిదకాక ముందే మీరు ఎందుకు తొందరపడ్డారని తీవ్ర స్థాయిలో బీజేపీ వైఖరిని ఎండగట్టింది. అధికారం అంటే ఎందుకంత యావ .. అధికారమే పరమావధా అని ప్రశ్నించింది.

 జాతీయ జెండా ఎగురేయలేరా ?

జాతీయ జెండా ఎగురేయలేరా ?

మాజీ రక్షణశాఖ మంత్రి చనిపోతే కేంద్రం సంతాపం ప్రకటించింది. కానీ గోవాలో మాత్రం సంతాపం ఆ దేవుడికేరక మని వ్యాఖ్యానించింది. దేశానికి రక్షణశాఖ మంత్రిగా, గోవా సీఎంగా సేవలు అందించిన పారికర్‌కు గౌరవసూచకంగా జాతీయ జెండా అవతనం చేయాలనే సోయి కూడా గోవా ప్రభుత్వానికి లేకుండాపోయిందని బీజేపీ వైఖరిని ఎండగట్టింది.

English summary
In a scathing attack on the political drama between the Bharatiya Janata Party (BJP) and its allies in Goa over the leadership issue, the Shiv Sena dubbed it as a "terrible state of democracy", saying they did not even wait for late chief minister Manohar Parrikar's ashes to cool down.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X