Tamilnadu: విజయ్ తో బీజేపీ పొత్తు ? ఈపీఎస్ ఓకే-నెక్ట్స్ ప్లాన్ ఇదే..!
తమిళనాడులో ద్రవిడ భావజాలం సాయంతో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన డీఎంకేతో పాటు ఇతర పార్టీల కూటమిని ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే దేశంలోని మెజార్టీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రంలో అధికారం మాటదేవుడెరుగు కనీస సీట్లు సాధించలేకపోతున్న బీజేపీ.. ఈసారి వ్యూహం మారుస్తోంది. ఇందులో భాగంగా విజయ్ ను పావుగా వాడుకోవాలని భావిస్తోంది.
టీవీకే పేరుతో పార్టీ పెట్టి జనంలో దూసుకుపోతున్న విజయ్ కు తమిళనాట ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. అయితే డీఎంకేను కొట్టే స్దాయిలో ఈ ఆదరణ ఉండకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. అసలే రాష్ట్రంలో డీఎంకేకు గట్టి ప్రత్యామ్నాయంగా దశాబ్దాల పాటు కొనసాగి.. జయలలిత మరణం తర్వాత కుదేలైన అన్నాడీఎంకే స్ధానాన్ని ఆక్రమించేందుకు విజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ వ్యతిరేకతతో పార్టీ పెట్టిన విజయ్ కు ఇప్పుడు అదే బీజేపీ నుంచి ఆఫర్లు అందుతున్నాయి.

తమిళనాడులో ప్రతిపక్ష శక్తులను ఏకీకృతం చేసే లక్ష్యంతో, విజయ్ పార్టీ టీవీకేతో పొత్తు పెట్టుకునే అవకాశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో పర్యటించిన అమిత్ షా.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నాలుగు సీట్లను భారీగా పెంచుకోవాలని బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం విజయ్ పార్టీ టీవీకేతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలైన ఏఎంఎంకే, పీఎంకే, ఏఐఏడీఎంకేలను కలుపుకుని ముందుకెళ్లాలని సూచించారు.

ఈ నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని కూటమిలోకి విజయ్ పార్టీ టీవీకేను చేర్చునేందుకు అన్నాడీఎంకే బాస్ పళనిస్వామి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మిగతా పార్టీలతో పాటు విజయ్ తోనూ అంతర్గతంగా చర్చలు జరిపి కూటమికి ఒప్పించే టాస్క్ ను అమిత్ షా స్థానిక నేతలకు అప్పగించారు. కానీ ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలవాలన్న పట్టుదలతో ఉన్న విజయ్ ను బీజేపీ నేతలు ఏమేరకు ఒప్పిస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే బీజేపీ లౌకిక వాదంపై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో తాము కాంగ్రెస్ పార్టీకి సహజమిత్రులుగా ఉంటామని విజయ్ పార్టీ ఇప్పటికే ప్రకటించడం విశేషం.
-
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
విజయ్ పార్టీలో సినిమా చిచ్చు! కీలక పార్టీ మద్దతు ఖతం -
విజయ్ విజిల్ రీసౌండ్- పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ గ్రౌండ్ రిపోర్ట్ -
కోలీవుడ్ పట్టించుకోకున్నా "దళపతి విజయ్"కి అండగా మెగాస్టార్..! -
ఒక్క దెబ్బకు మూడు పిట్టలు కాదు.. ఒక్క నామినేషన్‌కు మూడు పార్టీలు! -
విజయ్ ప్రచారంలో దారుణం: అభిమానుల్ని బూట్లతో తన్నిన బౌన్సర్లు -
ప్రతి నెలా రూ. 3,000 సాయం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు!












Click it and Unblock the Notifications