ఢిల్లీ నుంచి ఫోన్లు, హైకమాండ్ ఆదేశాలు, సూచనలు, కొత్త నాయకుడితో కొత్త నీళ్లు వస్తాయా ?
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, లింగాయత్ కులంలో ప్రభావవంతమైన నాయకుడు బీఎస్ యడ్యూరప్ప కుమారుడు బీ వై విజయేంద్రను బీజేపీ కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బీజేపీ హైకమాండ్ నియమించింది. బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తదితరులు బీవై విజయేంద్రకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు.
రాజకీయంగా బీఎస్ యడియూరప్పకు ప్రత్యర్థిగా ఉన్న అదే బీజేపీ సీనియర్ నాయకుడు బీఎల్ సంతోష్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు బీవై విజయేంద్రకు ఫోన్ చేసి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పి ఆయనతో పార్టీకి సంబంధించి విషయాల గురించి మాట్లాడారని తెలిసింది. కర్ఱాటక రాష్ట్రానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో ట్వీట్లు చేసి బీవై. విజయేంద్రకు శుభాకాంక్షలు తెలిపారు.

మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ కూడా ఫోన్ చేసి బీవై విజయేంద్రకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ ట్వీట్ ద్వారా విజయేంద్రను అభినందించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా షికారిపుర ఎమ్మెల్యే బీవై విజయేంద్రను బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం సంతోషంగా ఉందంటూ సోషల్ మీడియాలో రాయడం హాట్ టాపిక్ అయ్యింది.
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్ అభినందనలు తెలుపుతూ మీ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అయితే కర్ణాటక రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన యువ నాయకుడు బీ వై విజయేంద్రకు నా హృదయపూర్వక అభినందనలు. మీరు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ మరింత పుంజుకోవాలని, మీరు ఇంకా పార్టీ కోసం పని చెయ్యడానికి ఆదేవుడు మీకు ఇంకా మరింత శక్తి ఇవ్వాలని ఆశీస్సున్నానని కోరుకున్నారు.
ఢిల్లీలోని బీజేపీ హైమాండ్ నాయకులతో పాటు వివిద రాస్ట్రాలకు చెందిన బీజేపీ నాయకులు బీవై. విజయేంద్రకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు బీవై విజయేంద్ర ఇంటికి క్యూ కడుతున్నారు. అయితే ఇంతకాలం బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఢిల్లీలో పావులు కదిపిన కొందరు నాయకులు మాత్రం సైలెంట్ గా ఉన్నారని తెలిసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications