Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లంకకు సైన్యాన్ని పంపండి- కేంద్రాన్ని కోరిన బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి

శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం రాజకీయ సంక్షోభంగా మారిపోయింది. దేశమంతా హింస ప్రజ్వరిల్లుతోంది. ప్రజాగ్రహంతో ప్రధాని మహీంద రాజపక్స రాజీనామా చేసేసి నావల్ బేస్ కు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి దాక్కున్నారు. అధ్యక్షుడు గోటబాయ రాజపక్స కూడా రాజీనామా చేయాలని నిరనసకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంకలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కూడా కష్టతరంగా మారింది.

భారత్ పొరుగున ఉన్న శ్రీలంకలో నానాటికీ క్షీణిస్తున్న పరిస్ధితులు మన దేశానికీ ఇబ్బందికరంగా మారుతున్నాయి. భద్రతా పరంగా సమస్యలు సృష్టించే అవకాశాలూ కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో శ్రీలంక పరిణామాల్లో భారత్ జోక్యం కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే శ్రీలంకకు మానవతా సాయం అందిస్తున్న భారత్.. ఇప్పుడు సైన్యాన్ని కూడా పంపాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

bjp leader subramanian swamy ask centre to send army to sri lanka to restore constitution

ఇదే క్రమంలో బీజేపీ నేత, మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కూడా కేంద్రాన్ని ఓ డిమాండ్ చేశారు. రాజ్యాంగ బద్ధతను పునరుద్ధరించడానికి భారతదేశం తప్పనిసరిగా శ్రీలంకకు భారత సైన్యాన్ని పంపాలని ఆయన ట్విట్టర్ లో కోరారు. ప్రస్తుతం భారత వ్యతిరేక విదేశీ శక్తులు ప్రజల ఆగ్రహాన్ని ఉపయోగించుకుంటున్నాయని, ఇది భారతదేశ జాతీయ భద్రతను ప్రభావితం చేస్తుందని ఆయన తెలిపారు.

అయితే భారత్ కు గతంలో శ్రీలంకకు సైన్యాన్ని పంపి తీవ్రంగా దెబ్బతిన్న చరిత్ర ఉంది. గతంలో 1992లో అంతర్గత పోరుతో సతమతం అవుతున్న శ్రీలంకకు శాంతిదళాల్ని పంపిన భారత ప్రధాని రాజీవ్ గాంధీని అనంతరం తమిళ టైగర్లు ఆత్మాహుతి దాడితో పొట్టనబెట్టుకున్నారు. ఆ ఉదంతాన్ని భారత్ ఇంకా మర్చిపోలేదు. ఈ నేపథ్యంలో శ్రీలంకకు సైన్యాన్ని పంపే విషయంలో కేంద్రం కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్ధితులు ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+