Kangana Ranaut: రాజకీయాల కంటే సినిమాలే బెటర్.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సంచలనం!!

బాలీవుడ్ నటి, బిజెపి ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల జరిగిన ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇలా విజయం సాధించారో లేదో అలా అనేక వివాదాలకు, సంచలన వ్యాఖ్యలకు కంగనా రనౌత్ వేదికగా మారుతున్నారు.

ఎంపీగా గెలిచిన రెండు రోజుల్లోనే కంగనా వివాదం
ఇటీవల చండీగఢ్ ఎయిర్పోర్ట్ లో విధుల్లో ఉన్న సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ తనను చెంప దెబ్బ కొట్టారని, అసభ్య పదజాలంతో దూషించారని కంగనా రనౌత్ ఆరోపించిన తర్వాత, ఆమెను సస్పెండ్ చేయడం, అరెస్టు చేయడం, ఆ తర్వాత రైతు సంఘాలు సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ కు మద్దతుగా ఆందోళన చేయడం దీనిపైన కంగనా రనౌత్ అసహనం ప్రదర్శించడం తెలిసిందే.

BJP MP Kangana Ranaut sensation Movies are better than politics

పాలిటిక్స్ కంటే సినిమాలే బెటర్: కంగనా సంచలనం
ఇక తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్ ఓ ఇంటర్వ్యూలో ఏకంగా సినిమా ఇండస్ట్రీ రాజకీయాలకు మధ్య కీలక తేడాలని వెల్లడించారు. పాలిటిక్స్ కంటే సినీ ఇండస్ట్రీ చాలా నయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజం చెప్పాలంటే రాజకీయాల కంటే సినిమాలే చాలా ఈజీ అని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

సినిమాలే ఈజీ.. రాజకీయ జీవితం చాలా కఠినం
రాజకీయ జీవితం అనేది చాలా కఠినమైన జీవితమని సినిమాల లాగా కాదని పేర్కొన్న కంగనా రనౌత్ నటులు సినిమాలు తీయడంతో పాటు, వాటిని రిలీజ్ చేయడంతో రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుందని, కానీ రాజకీయ జీవితంలో అటువంటి రిలాక్సేషన్ ఉండదని వ్యాఖ్యలు చేశారు . రాజకీయాలలో చాలా కఠినమైన జీవితం నెట్టుకు రావాల్సి ఉంటుందని కంగనా రనౌత్ తెలిపారు.

రాజకీయ నాయకులు ఎప్పుడూ ఆ పని చెయ్యాలి
అస్వస్థతకు గురైన పేషెంట్ల కోసం డాక్టర్లు చేసే సేవలాగా కష్టాలలో ఉన్న ప్రజలను ఆదుకోవడం కోసం రాజకీయ నాయకులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఆమె పేర్కొన్నారు. తాను తన గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ సూచించిన మార్గంలో రాజకీయాల్లోకి వచ్చానని ఆమె తెలిపారు. ఇక తను రాజకీయాల్లోకి రావాలని ఎప్పటినుంచో ఆఫర్లు వచ్చాయని తన మొదటి సినిమా గ్యాంగ్ స్టర్ రిలీజ్ అయిన వెంటనే రాజకీయాల్లోకి రావాలని తనకు పిలుపు వచ్చిందని పేర్కొన్నారు.

రాజకీయాలపై కంగనా వ్యాఖ్యలు
రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో మొదటి నుంచి తమను రాజకీయాలలోకి రావాలని అడిగినట్టు వెల్లడించారు. తన తాత సర్జూ సింగ్ రనౌత్ మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారని పేర్కొన్నారు. తన తండ్రికి, తన సోదరికి కూడా రాజకీయాల నుండి చాలా ఆఫర్లు వచ్చాయని తెలిపారు. తనకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉండటం వల్లనే ఇంత కష్టపడి ఇక్కడ వరకు వచ్చానని, లేదంటే వచ్చేదాన్ని కాదని కంగనా రనౌత్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+