బీఎస్పీ ముస్లిం ఎంపీని తీవ్రవాది అన్న బీజేపీ ఎంపీ-లోక్ సభ స్పీకర్ సీరియస్-విపక్షాల ఫైర్..
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా లోక్ సభలో ఓ బీజేపీ ఎంపీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. బీఎస్పీకి చెందిన ముస్లిం ఎంపీని తీవ్రవాదిగా అభివర్ణిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రచ్చకు కారణమయ్యాయి. విపక్షాలన్నీ అధికార పార్టీ ఎంపీ తీరుపై మండిపడ్డాయి. చివరికి స్పీకర్ ఓం బిర్లా కూడా సీరియస్ అయ్యారు. సదరు వ్యాఖ్యలపై రక్షణ మంత్రి సారీ కూడా చెప్పారు. ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి కూడా తొలగించారు. అయినా వివాదం మాత్రం సద్దుమణగలేదు.
నిన్న లోక్ సభలో చంద్రయాన్ 3 విజయంపై చర్చ జరుగుతుండగా.. బీఎస్పీ ఎంపీ దానిష్ అలీని ఉద్దేశించి బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను ఓ తీవ్రవాదిగా అభివర్ణిస్తూ పదే పదే రెచ్చిపోయారు. దీంతో లోక్ సభలో తీవ్ర కలకలం రేగింది. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. విపక్షాలన్నీ ఏకమై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరిపై చర్యలకు పట్టుబట్టాయి. దీంతో స్పీకర్ ఓం బిర్లా కూడా ఆ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి వివాదాస్పద వ్యాఖ్యలపై మండిపడ్డ విపక్షాలు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సభలో విచారం వ్యక్తం చేశారు. తమ సభ్యుడు చేసిన వ్యాఖ్యల వల్ల విపక్షాలు బాధపడితే చింతిస్తున్నాను అని రక్షణ మంత్రి తెలిపారు. అయితే రక్షణ మంత్రి క్షమాపణలు చెప్పినంత మాత్రాన సరిపోదని, రమేష్ బిధూరిని సస్పెండ్ చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఇది పూర్తిగా అవమానకరమని, రాజ్‌నాథ్ సింగ్ క్షమాపణలు ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ తెలిపారు. ఇది పార్లమెంటును అవమానించడమే అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ వీడియో షేర్ చేస్తూ బీజేపీ ఎంపీ పార్లమెంటులో స్పీకర్ ముందు ఈ మాటలతో మరో ముస్లిం ఎంపీని పిలవడం బిజెపి సంస్కృతి కాదా అని ప్రశ్నించింది. పార్లమెంటు చరిత్రలోనే ఇది చీకటి రోజు అని ఆ పార్టీ పేర్కొంది. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ ఉపయోగించిన మతపరమైన దూషణలకు తాను బాధపడ్డానని అన్నారు. నాకు బాధ కలిగింది కానీ ఆశ్చర్యం కలగలేదన్నారు. ఇది ప్రధానమంత్రి 'వసుధైవ కుటుంబం'లో నిజం అన్నారు. పార్లమెంట్‌లో ఎంపీకి ఇలాంటి పదాలు వాడితే ముస్లింలకు, దళితులకు ఎలాంటి చట్టబద్ధత కల్పించారో ఆలోచించాలన్నారు.












Click it and Unblock the Notifications