ఢిల్లీ కేంద్రంగా పవన్ కు మోదీ బిగ్ టాస్క్..!!
Delhi Assembly Election 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు కౌంట్ డౌన్ కొనసాగు తోంది. ప్రధాన పార్టీలు హోరా హోరీగా తలపడుతున్నాయి. ఫిబ్రవరి 3తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ప్రధాన పార్టీలు.. మేనిఫెస్టోలు, హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఢిల్లీలో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. తెలుగు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ నేతలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను రంగంలోకి దించుతున్నారు.
బీజేపీకి ప్రతిష్ఠాత్మకం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమరం పతాక స్థాయికి చేరింది. ప్రతీ నియోజకవర్గంలో గెలుపు ప్రధాన పార్టీలకు కీలకంగా మారుతోంది. ఈ సమయంలో ఢిల్లీలో సెటిల్ అయిన ఇతర రాష్ట్రాల ఓటర్ల ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందు కోసం సంబంధిత రాష్ట్రాల నేతలను కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీలో బాధ్యతలు అప్పగిస్తున్నాయి. ఈ అవకాశం ఆప్ కు లేదు. ఇక, బీజేపీ తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తో ప్రచారం చేయిం చాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ వారం చివర్లో పవన్ ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది.

ఏపీ - తెలంగాణ నేతలతో
మహారాష్ట్ర లోనూ బీజేపీ కూటమి అభ్యర్ధుల కోసం పవన్ ప్రచారం చేసారు. అక్కడ సానుకూల స్పందన కనిపించింది. ఢిల్లీలోనూ ఇప్పుడు అదే విధంగా ప్రచారం చేయించే విధంగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దిల్లీలో సుమారు 3 లక్షల మంది తెలుగు ఓటర్లు ఉంటారని అంచనా వేస్తున్నారు. వారి ఓట్లను సొంతం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన వారిని బీజేపీ ఢిల్లీలో మోహరిస్తోంది. బీజేపీ,తెలుగుదేశం నేతలను వారితో టచ్‌లో ఉండాలని ఇప్పటికే సూచించింది. అదే విధంగా పవన్ ప్రచారం చేయాల్సిన నియోజకవర్గాల పైన బీజేపీ నేతలు జాబితా సిద్దం చేసారు.
పవన్ ప్రచారం
ప్రధాని మోదీ పర్యటన ఉండటంతో.. తేదీల ఖరారు పైన ప్రస్తుతం చర్చలు చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా తెలంగాణ బీజేపీ నేతలను రంగంలోకి దించుతున్నారు. ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీ వైపే ఓటర్లు మొగ్గు చూపారు. ఇప్పుడు అసెంబ్లీలో కాంగ్రెస్ పోటీ లో ఉన్నా ప్రధానంగా బీజేపీ - ఆప్ మధ్య హోరా హోరీగా ఎన్నికల యుద్దం కొనసాగుతోంది. దీంతో, పవన్ ఢిల్లీ ప్రచారానికి దిగితే ఎలాంటి ప్రభావం ఉంటుంది.. ఏ మేర బీజేపీకి కలిసి వస్తుందనే చర్చ ప్రస్తుతం ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. పవన్ ప్రచారం పైన ఈ రోజు లేదా రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications