3,000 పెన్షన్, ఉచితంగా ఎల్‌పీజీ సిలిండర్లు.. కేరళలో బీజేపీ మేనిఫెస్టో ఇదే..

కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. కేరళలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్, కేరళ బీజేపీ సీనియ‌ర్ నేత రాజీవ్ చంద్రశేఖర్, ఇతర సీనియర్ పార్టీ నాయకులతో కలిసి మంగళవారం తిరువనంతపురంలో కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఓనమ్, క్రిస్మస్ పండగ సందర్భంగా ఉచితంగా ఎల్పీజీ అందిస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. అలాగే ప్రతి నెలా 20 వేల లీటర్ల నీళ్లను కూడా అందిస్తామని తెలిపింది. ఈ మేరకు బీజేపీ తన మేనిఫెస్టోలో మహిళలు, యువత కోసం అనేక పథకాలను ప్రకటించింది. కేరళలో ఎయిమ్స్ నిర్మిస్తామని నితిన్ నవీన్ హామీ ఇచ్చారు.

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ఆ పార్టీ అధ్యక్షుడు నితిన్ నవీన్.. సీనియర్ పార్టీ నాయకులతో కలిసి తిరువనంతపురంలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. కేరళలోని పేద కుటుంబాలకు ప్రతి సంవత్సరం రెండు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు ఇస్తామ‌ని పేర్కొంది. ఒక సిలిండర్‌ ను ఓనం పండుగ సందర్భంగా.. అలాగే మరొకటి క్రిస్మస్ సందర్భంగా పంపిణీ చేస్తారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నెలకు 20,000 లీటర్ల ఉచిత నీటిని అందిస్తామని కూడా బీజేపీ హామీ ఇస్తోంది.

అంతేకాక దిగువ పేదరికం కుటుంబాలకు చెందిన వారికి ప్రతి నెలా రేషన్ సదుపాయం, అందరికీ ఆయుష్మాన్ భారత్ పీఎం- జేఏవై కవరేజీ వర్తింపు, రాష్ట్రంలో ఎయిమ్స్ క్యాంపస్, పెన్షన్ ను రూ. 3000 లకు పెంచడం, హై స్పీడ్ కారిడార్ తదితర వరాలు మేనిఫెస్టోలో ఉన్నాయి. అలాగే వికసిత్ కేరళ లో భాగంగా శబరిమల, గురువాయూర్ వంటి పుణ్యక్షేత్రాలను పరిరక్షించేందుకు దేవస్వం బోర్డులను పునర్వ్యవస్థీకరించనున్నట్లు బీజేపీ స్పష్టం చేసింది.

BJP Releases Kerala Manifesto 3 000 Monthly Pension amp amp Free LPG Cylinders BJP Kerala promises

ఇక ముల్లపెరియార్ డ్యామ్ విషయంలో తమిళనాడుకు నీటిని, కేరళకు భద్రతను కల్పిస్తామని కూడా మేనిఫెస్టో హామీ ఇస్తోంది. అర్హులైన మహిళలకు, వితంతువులకు, అలాగే 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు నెలకు రూ. 3,000 సంక్షేమ పింఛన్ కూడా ఇవ్వనున్నట్లు మేనిఫెస్టోలో ప్రకటించింది. అలాగే భక్ష్య ఆరోగ్య సురక్షా కార్డు కింద బీపీఎల్ కుటుంబాలకు ప్రతి నెలా రూ. 2,500 సాయం అందజేయనున్నారు. ఇక కొచ్చి మెట్రో రైలు మిగిలిన ఫేజ్ లను పూర్తి చేయడం, తిరువనంతపురం, కోజికోడ్ లో మెట్రో సర్వీసులు చేపట్టనున్నట్లు మేనిఫెస్టోలో బీజేపీ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+