బట్టలు చించేశారు.. నోటితో చెప్పరాకుండా తిట్టారు.. బీజేపీ మహిళానేతపై లైంగిక దాడి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాలను కలిసిన కొద్దిరోజుల్లోనే కోల్‌కతాలో బీజేపీ మహిళా నేతపై దాడి జరిగింది. ఫ్యాషన్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించి ఆపై రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అగ్నిమిత్ర పాల్ పై కొందరు రౌడీ మూకలు దాడి చేశారు. అంతేకాదు ఆమెను దూషించారు. అదే సమయంలో లైంగికంగా కూడా వేధించారు. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీకి చెందిన విద్యార్థులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు రౌడీ మూకలు తన బట్టలను చింపివేశారని అగ్నిమిత్ర ఆరోపించారు.

బీజేపీ విద్యార్థి అనుబంధ సంస్థ ఏబీవీపీ ఆహ్వానం మేరకు ఓ కార్యక్రమం హాజరయ్యేందుకు జాదవ్‌పూర్ యూనివర్శిటీకి అగ్నిమిత్ర కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోలు వెళ్లారు. వారిని గెస్ట్ స్పీకర్లుగా ఆహ్వానించడం జరిగింది. కార్యక్రమం జరిగే వేదిక దగ్గరకు తాము వెళుతున్న సమయంలో కొందరు అల్లరి మూకలు తమను అడ్డుకున్నారని వ్యతిరేకంగా నినాదాలు చేశారని చెప్పారు. అయితే వీరంతా అదే యూనివర్శిటీకి చెందిన విద్యార్థులని అగ్నిమిత్ర చెప్పారు. క్రమంతా వారిపై దాడి చేయడం ఆ తర్వాత దూషణలకు దిగడం చేశారని అగ్నిమిత్ర చెప్పారు. జాదవ్‌పూర్ పోలీసులకు తాను ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

BJP Woman leader Agnimitra Paul files complaint that she was molested by students

ఇక కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోపై చెప్పరాని మాటల్లో అల్లరిమూకలు దూషణలకు దిగారని వెల్లడించారు. అంతేకాదు తమ సిబ్బందికి కూడా రక్షణ లేకుండా పోయిదన్నారు. తనపై దూషణలకు దిగి, తనను లైంగికంగా వేధించారని అగ్నిమిత్ర వెల్లడించారు. తన బట్టలను చించివేసి ఇతరులను కూడా తనపై దాడి చేయాలంటూ రెచ్చగొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు అగ్నిమిత్ర పాల్. అగ్నిమిత్ర ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి కేసు విచారణను చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+