బీజేపీకి మైనస్ సీట్లు అయినా మానం కాపాడుకున్న నాయకులు, సెక్స్ సెండల్ హీరో ఔట్ !!
లోక్ సభ ఎన్నికల ఫలితాలు బీజేపీతో పాటు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు నిరాశ చెందుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఎన్డీఏ నాయకులు ఊహించిన 400 ఎంపీ సీట్లు రాకపోవడంతో ఆ పార్టీల నాయకులు అయోమయంలో పడిపోతున్నారు. ఇదే సమయంలో ఇండియా కూటమిని ప్రజలు ఆధరించడంతో ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఇండియా కూటమి లీడర్స్ కు రానురాను ధైర్యం వస్తోంది.
ఇక గత లోక్ సభ ఎన్నికల్లో 25 ఎంపీసీట్లు కైవసం చేసుకున్న బీజేపీ నాయకులు ఈసారి 17 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కర్ణాటకలో జరిగిన కొన్ని రాజకీయ పరిణాల దెబ్బతో బీజేపీ దెబ్బ తినింది అని చెప్పాలి. బీజేపీకి 17 సీట్లు, ఎన్డీఏ మిత్రపక్షం అయిన జేడీఎస్ రెండు సీట్లలో విజయం సాధించారు. కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి మండ్యలో ఎంపీగా విజయం సాధించడంతో జేడీఎస్ నాయకులతో పాటు బీజేపీ నాయకులు ఊపిరిపీల్చుకున్నారు.

ఇక సెక్స్ స్కాండల్ కేసులో చిక్కుకున్న లోక్ సభ రెండో విడత పోలింగ్ కు ముందు బీజేపీ, జేడీఎస్ పార్టీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అదే హాసన్ లో ఓడిపోయారు. మైనింగ్ కింగ్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ప్రాణ స్నేహితుడు, మాజీ మంత్రి బి, శ్రీరాములు సైతం బళ్లారిలో ఓడిపోయారు. లోక్ సభ ఎన్నికలకు ముందు గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో చేరినా ఉత్తర కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటకలో ఆయన ప్రభావం బీజేపీలో పెద్దగా కనిపించలేదనే చెప్పాలి.

ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు లోక్ సభ నియోజక వర్గం నుంచి జేడీఎస్ టిక్కెట్ తో పోటీ చేసిన మల్లేష్ బాబు ఎవ్వరూ ఊహించని విధంగా విజయం సాధించారు. ఇక బెంగళూరులో బీజేపీ ఎంపీలు విజయం సాధించడంతో బీజేపీ నాయకులు హ్యాపీగా ఉన్నారు. కర్ణాటక డీసీఎం, కేపీసీ అధ్యక్షుడు డీకే సురేష్ ను బెంగళూరు గ్రామీణ జిల్లా ప్రజలు ఓడించారు. డీసీఎం డీకే శివకుమార్ తన తమ్ముడిని గెలిపించుకోలేకపోవడంతో ఆయన అభిమానులు నిరాశ చెందారు.
బెంగళూరు గ్రామీణ లోక్ సభ నియోజక వర్గంలో డీకే శివకుమార్ మీద పొటీ చేసిన మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ అల్లుడు, డాక్టర్ సీఎన్. మంజునాథ్ విజయం సాధించారు. కర్ణాటకలో 17 ఎంపీ సీట్లలో బీజేపీ, రెండ సీట్లలో జేడీఎస్ విజయం సాధించడంతో ఆ పార్టీల నాయకులు ఊపిరిపీల్చుకున్నారు. రెండో విడతలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ దెబ్బ పడిందని బీజేపీ నాయకులు అంటున్నారు. శివమొగ్గలో మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్ర చేతిలో హ్యాట్రిక్ హీరో శివకుమార్ కుమార్ భార్య గీతా శివరాజ్ కుమార్ ఓడిపోయారు.












Click it and Unblock the Notifications