డెమోక్రసీని అపహాస్యం చేశారు.. బీజేపీ గుండాలతో దాడులకు తెగబడ్డారు : షా వర్సెస్ దీదీ
కోల్ కతా : కోల్ కతాలో బీజేపీ చీఫ్ అమిత్ షా నిర్వహించిన సేవ్ డెమోక్రసీ ర్యాలీ హింసాత్మకంగా మారింది. రాష్ట్రంలో మమత హిందీ, ఉర్దూ మాట్లాడేవారిని విభజించాలని చూస్తున్నారని ఆరోపించారు. తమ ర్యాలీలో ఇతరులు ప్రవేశించారనే మమత ఆరోపణలను తోసిపుచ్చారు. ఇవాళ తీసిన ర్యాలీలో కోల్ కతా ప్రజలు పాల్గొన్నారని చెప్పారు. వాంరతా బెంగాల్ కు చెందిన వారు .. సంస్కృతి, సాంప్రదాయాలను అలవర్చుకున్నారని పేర్కొన్నారు. అంతేకాని చొరబడలేదని మండిపడ్డారు.

షా వర్సెస్ దీదీ
బెంగాల్ లో ప్రజాస్వామ్యం లేదని .. డెమోక్రసీని మమతా అపహాస్యం చేశారని మండిపడ్డారు అమిత్ షా. తన గుండాలు, పోలీసులతో ర్యాలీని అడ్డుకునేందుకు శతవిధలా ప్రయత్నించిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఓ వ్యక్తి సభలు, సమావేశాలను అడ్డుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో జై శ్రీరాం అని పలికితే మమతా బెనర్జీ భయపడుతున్నారన్నారు షా. దేశంలో బీజేపీ గాలి వీస్తోందన్నారు. మోదీ మరోసారి ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు బెంగాల్ లో బీజేపీ కమలం వికసిస్తుందని అంచనా వేశారు. తమ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమావ్యక్తం చేశారు.
ఫైర్ బ్రాండ్ ఫైర్
అమిత్ షా ఆరోపణలను దీదీ ఖండించారు. విద్యసాగర్ కాలేజీ వద్ద బీజేపీ కార్యర్తలు టీఎంసీ విద్యార్థి నేతపై దాడిచేశారని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ గుండాలు రాష్ట్రంలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. కాలేజీలో విద్యాసాగర్ విగ్రహాన్ని కూడా పడగొట్టిందని బీజేపీ గుండాలేనని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కాషాయమయం
కోల్ కతాలోని ఎస్ప్లానడె నుంచి స్వామి వివేకానంద ఇంటివరకు అమిత్ షా భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్ షో ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ అమిత్ షా కోసం భారీ వాహనం సమకూర్చారు. దానిపై కాషాయ బెల్లూన్లను, బీజేపీ జెండాలను ఉంచారు. అంతేకాదు అమిత్ షా నిర్వహించే రోడ్ షో మార్ంలో 10 వేల బంతిపూల తోరణాలు కట్టారు. దేశంలోని వివిధ కళాబృందాలతో నాట్యం చేయించారు.