బ్లాక్ ఫ్రైడే సేల్.. యూఎస్ లోనే కాదు ఇండియాలోనూ 85% వరకు అదిరిపోయే ఆఫర్లు!
బ్లాక్ ఫ్రైడే.. యూఎస్ఏ లో అతి పెద్ద షాపింగ్ డే ప్రతి సంవత్సరం క్రిస్మస్ కి సుమారు నెల రోజులకు ముందు నవంబర్ నెలలో వచ్చే నాలుగవ శుక్రవారం ఈ సేల్స్ ను ఏర్పాటు చేస్తారు. కచ్చితంగా చెప్పాలంటే అమెరికాలో థాంక్స్ గివింగ్ డే తర్వాత రోజు బ్లాక్ ఫ్రైడే వస్తుంది. ఆరోజున దుకాణాలలో వినియోగదారులకు భారీ డిస్కౌంట్లను ఇస్తారు.
బ్లాక్ ఫ్రైడే మొదలైంది అప్పుడే
సహజంగా నలుపును విపత్తులు కష్టాలకు సూచికగా చెబుతారు. 1869లో వ్యాపారులు జే గౌల్డ్, జేమ్స్ ఫిస్క్ గోల్డ్ మార్కెట్ మూతపడుతున్న సమయంలో ఈ ఆఫర్లను ప్రారంభించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు యులిస్సెస్ ఎస్. గ్రాంట్ ఆ రోజున బంగారం పైన పెద్ద మొత్తంలో దాదాపు 18 శాతం ధరను తగ్గించారు.

భారతదేశంలో బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు
అప్పటినుండి బ్లాక్ ఫ్రైడే సేల్ కొనసాగుతుంది. ఒక అమెరికాలోనే కాదు ఇది క్రమంగా మన ఇండియాకి కూడా వ్యాపించింది. ఆన్లైన్ ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ లు బ్లాక్ ఫ్రైడే సందర్భంగా అనేక అద్భుతమైన ఆఫర్లను ఇస్తున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు వివిధ ఈ కామర్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
ఇండియాలో ఈ ఆన్ లైన్ సైట్స్ లో భారీ డిస్కౌంట్ లు
ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, హోమ్ నీడ్స్, ఫ్యాషన్, బ్యూటీ వంటి అనేక రకాల ఉత్పత్తుల పైన బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలో flipkart, myntra, amazon, ajio, nykaa, tata cliQ వంటి సైట్లు 85 శాతం వరకు తగ్గింపులు అందిస్తున్నాయి. Croma వంటి స్టోర్స్ కూడా ఎలక్ట్రానిక్స్ పై 50% వరకు తగ్గింపులను అందిస్తున్నాయి.
అన్ని ఉత్పత్తులపైన 85% వరకు తగ్గింపు
ముఖ్యంగా ఈ డీల్స్ లో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల పైన గొప్ప డిస్కౌంట్లను పొందవచ్చు. మింత్రా, amazon, flipkart వంటి సైట్లు ఫ్యాషన్ మరియు బ్యూటీ ఉత్పత్తుల పైన 85% వరకు తగ్గింపు లతో భార్య ఆఫర్లను అందిస్తున్నాయి. అయితే కొన్ని డీటెయిల్స్ ముందుగానే ప్రారంభం కాగా, మరికొన్ని డీల్స్ సైబర్ సోమవారం వరకు కొనసాగుతాయి.
పరిమిత కాల ఆఫర్లు
ఈ ఆఫర్ లన్ని ఆన్లైన్లో మాత్రమే కాదు ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా పరిమిత కాలమే ఉండే ఈ ఆఫర్లను వివిధ ఆన్లైన్ సైట్లలోకి వెళ్లి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసి భారీ డిస్కౌంట్లను పొందండి.ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ ను ఎంజాయ్ చెయ్యండి.












Click it and Unblock the Notifications