మరో బాలీవుడ్ నటుడు అనుమానాస్పద మృతి...సుశాంత్ మృతి ఘటన నుంచి తేరుకోకముందే..!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే మరో బాలీవుడ్ నటుడు అనుమానాస్పద పరిస్థితుల్లో అతని గదిలో మృతి చెందాడు. ఆసిఫ్ బస్రా అనే బాలీవుడ్ నటుడు 53 ఏళ్ల వయస్సులో ధర్మశాలలో ఆత్మహత్య చేసుకున్నాడు.

గురువారం రోజున బస్రా మెక్‌లాడ్‌గంజ్‌లోని ఓకేఫ్‌కు సమీపంలో ఉన్న తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత ఐదేళ్లుగా ఆసిఫ్ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడ తన ప్రియురాలితో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. అతని ప్రియురాలు యూకేకు చెందినట్లు సమాచారం. తన పెంపుడు కుక్కకు వినియోగించే బెల్టుతో ఆసిఫ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కంగ్రా ఎస్పీ విముక్త్ రంజన్ ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఆసిఫ్ మరణ వార్త తెలియగానే పోలీస్ బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుందని ఎస్పీ వివరించారు. ప్రస్తుతం లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

Bollywood actor Asif Basra found dead at his home in Dharmasala

Recommended Video

    Sushant Singh Rajput : సుశాంత్ కేసు విషయమై దిశా బాయ్ ఫ్రెండ్ ని అర్ధరాత్రి విచారించిన CBI

    ఇదిలా ఉంటే అతని మృతికి కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే అతని సన్నిహితులు మాత్రం ఆసిఫ్ గత కొంతకాలంగా డిప్రెషన్‌లో ఉన్నట్లు చెప్పారు. అయితే దర్యాప్తు తర్వాతే పూర్తి విషయాలు వెల్లడవుతాయని పోలీసులు చెప్పారు. ఇక ఆసిఫ్ ప్రొఫెషన్‌కు వస్తే.. చాలా పెద్ద ప్రాజెక్టుల్లో ఆయన పని చేశాడు. కైపోచే, వన్స్ అపాన్‌ ఎ టైమ్ ఇన్ ముంబై, బ్లాక్ ఫ్రైడే, జబ్‌ వి మెట్, క్రిష్-3, హిక్కీ, పర్జానియా లాంటి పెద్ద చిత్రాల్లో నటించాడు. బాలీవుడ్ సినిమాలతో పాటు ఔట్ సోర్స్ అనే హాలీవుడ్ సినిమాలో కూడా నటించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+