Chrisann Pereira: జైలు నుంచి విడుదలైన బాలీవుడ్ నటి..
బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా షార్జా జైలు నుంచి విడుదలయ్యారు. డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో బాలీవుడ్ నటిని షార్జా పోలీసులు అరెస్ట్ చేశారు. పెరీరాను ఈ నెల ప్రారంభంలో షార్జాలో అరెస్టు చేశారు. ఆమె ట్రోఫీలో డ్రగ్స్ దాచిపెట్టారనే ఆరోపణలతో ఏప్రిల్ 1న అరెస్టయింది.
27 ఏళ్ల క్రిషన్ పెరీరా సడక్ 2, బాట్లా హౌస్ వంటి చిత్రాలలో నటించారు. అయితే ఈ కేసులో పెరీరాను కావాలనే ఇరికించారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. క్రిసాన్ ను అరెస్ట్ చేసిన 72 గంటల తర్వాత తమకు విషయం తెలిందని చెప్పారు.

భారత కాన్సులేట్ పెరీరా అరెస్ట్ అయినట్లు తమ సమాచారం ఇచ్చిందని పేర్కొన్నారు. తన సోదరిని రెండు వారాలుగా దుబాయ్ పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని పెరీరా సోదరుడు కెవిన్ ఆరోపించారు. డ్రగ్స్ అక్రమ రవాణా వెనుక రవి అనే వ్యక్తి క్రిసాన్ కుటుంబసభ్యులు ఆరోపించారు. క్రిసన్ దుబాయ్‌లో ఆడిషన్ చేయడానికి వెళ్లిందని.. అందుకు రవి అనే వ్యక్తి ఏర్పాట్లు చేశాడని చెప్పారు. ఏప్రిల్ 1న క్రిసన్ విమానం ఎక్కే ముందు నిందితుల నుంచి ఆమెకు కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
వారు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న ఒక కాఫీ షాప్‌లో పెరీరాను కలుసుకున్నారని గుర్తించారు. వారు ఆమెకు ట్రోఫీని అందజేశారు. ఈ ట్రోఫీ ఆడిషన్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌లో భాగమని క్రిసాన్ తల్లి చెప్పారు.
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో బాలీవుడ్ నటిని ఇరికించినందుకు ఇద్దరు వ్యక్తులను ముంబై క్రైమ్ బ్రాంచ్ కూడా అరెస్టు చేసింది. నిందితులను ముంబైలోని బోరివలి నివాసి ఆంథోనీ పాల్, మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాకు చెందిన రాజేష్ బభోటే అలియాస్ రవిగా గుర్తించారు.
ఇద్దరు నిందితులు ఆమె షార్జాకు తీసుకెళ్లిన పెరీరా ట్రోఫీలో డ్రగ్స్ దాచిపెట్టారు. పాల్, అతని సహచరుడు రవితో కలిసి, అంతర్జాతీయ వెబ్ సిరీస్ కోసం ఆడిషన్ కోసం క్రిసాన్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు పంపాలని కుట్ర పన్నాడు. ఎయిర్‌పోర్టుకు వెళుతుండగా, డ్రగ్స్ దాచిన ట్రోఫీని ఆమెకు అందజేశారు. అలాగే పాల్ మరో నలుగురిని కూడా ఇలాగే ఇరికించాడని అధికారులు గుర్తించారు. జైలు విడుదలైన కిసాన్ పెరీరా భారత్ లోని తన కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడింది. ఆమె తల్లితో మాట్లాడుతూ ఏడ్చారు.
ఆమె భారతదేశానికి తిరిగి వచ్చే వరకు తన గోప్యతను గౌరవించండని క్రిసాన పెరీరా ఏప్రిల్ 28 శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. "ప్రియమైన యోధులారా, నేను భారతదేశానికి తిరిగి వచ్చే వరకు దయచేసి నా గోప్యతను గౌరవించండి. ఈ వ్యక్తి లేదా అతని బృందం నన్ను ఎందుకు ఇరికించారో నాకు అర్థం కాలేదు, కానీ వాస్తవం ఏమిటంటే చాలా ఘోరంగా జరిగి ఉండవచ్చు"అని రాశారు.
-
పాప టాలెంట్ చూపిస్తోందిగా..! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
'ధురంధర్'కు కొత్త తలనొప్పి.. హైకోర్టుకు పంచాయితీ! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications