మహిళల వస్త్రధారణపై బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మహిళల వస్త్రధారణ మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సల్మాన్ ఖాన్ ఆదివారం రాత్రి ప్రసారమైన ఆప్ కి అదాలత్ టీవీ కార్యక్రమంలో మహిళల వస్త్రధారణ మీద వ్యాఖ్యలు చేశారు. దీంతో సల్మాన్ ఖాన్ పై నెట్టింట్లో పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలు పితృస్వామ్య నిబంధనలను కాపాడే వ్యాఖ్యలుగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సల్మాన్ ఖాన్ తో కలిసి నటించిన పాలక్ తివారీ అంతకు ముందు ఒక టీవీ షోలో మాట్లాడారు. కిసీ కా భాయ్.. కిసీ కా జాన్ సినిమాలో సల్మాన్ తో కలిసి నటించిన పాలక్ తివారీ సల్మాన్ ఖాన్ ను ఉద్దేశించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సల్మాన్ ఖాన్ తన సినిమా సెట్ లో ఉన్న మహిళలందరూ నిండుగా మెడ వరకు బట్టలు ధరించేలా చూస్తారని ఆమె పేర్కొన్నారు.

Salman Khans controversial comments on womens dressing

ఇక ఈ వ్యాఖ్యలతో సల్మాన్ ఖాన్ ను ప్రశ్నించిన ఆప్ కి అదాలత్ కార్యక్రమ హోస్ట్ రజత్ శర్మ మీరు మీ సినిమా సెట్స్ లోని మహిళల విషయంలో నిండుగా దుస్తులు ధరించాలని నియమం పెడతారట.. మరి మీరు ఎందుకు మీ సినిమాల్లో చొక్కా విప్పి నటిస్తారు అంటూ ప్రశ్నించారు. ఇది ద్వంద్వ ప్రమాణాల కిందకి రాదా అంటూ అడిగారు.

దీనికి సల్మాన్ ఖాన్ జవాబిస్తూ ఇందులో ద్వంద్వ ప్రమాణాలు ఏమీ లేవు. మహిళలు శరీర భాగాలు చాలా విలువైనవి అన్నదే నా అభిప్రాయం. ఇది మహిళల గురించే కాదు మన తల్లులు, సోదరీమణులూ, భార్య వంటి మహిళలను వక్రబుద్ధి తో చూసే కొందరిని ఉద్దేశించి చెబుతున్న మాట. దుస్తుల కారణంగా మహిళలు అవమానాలకు గురి కాకూడదని తాను కోరుకుంటున్నాను అంటూ సల్మాన్ ఖాన్ తెలిపారు.

తాను చేసిన వ్యాఖ్యల ఉద్దేశం అమ్మాయిలను ఎవరూ వక్ర దృష్టితో చూడకూడదు అనే అంటూ సల్మాన్ ఖాన్ చెప్పారు. ఇక సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలను చాలామంది సమర్థిస్తూ ఉంటే, సోషల్ మీడియాలో కొంత మంది నెటిజన్లు మాత్రం ఆయనను టార్గెట్ చేస్తున్నారు. మహిళలతో ఇష్టారాజ్యంగా డేటింగ్ చేసే సల్మాన్ ఖాన్ మహిళల గౌరవం గురించి, వాళ్ళ వస్త్ర ధారణ గురించి మాట్లాడుతున్నాడు అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+