Bomb threat: రైల్వే స్టేషన్లు, సూపర్ స్టార్ ఇల్లు బాంబులతో పేల్చేస్తాం, అర్దరాత్రి నిద్రలేకుండా !
ముంబాయి/బెంగళూరు: ప్రముఖ రైల్వే స్టేషన్లతో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇంటిని బాంబులతో పేల్చాస్తామని పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ రావడంతో దేశ ఆర్థిక రాజధాని ముంబాయి నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు మూడు ప్రధాన రైల్వే స్టేషన్లతో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంటి దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అర్దరాత్రి గుర్తు తెలియన వ్యక్తి ముంబాయి నగరం పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి పోలీసులకు, ముంబాయి ప్రజలకు నిద్రలేకుండా చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ తోపాటు మూడు రైల్వే స్టేషన్ల దగ్గర, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంటి దగ్గర ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనపడలేదని పోలీసు అధికారులు అంటున్నారు. పోలీసు కంట్రోల్ రూమ్ కు బాంబు బెదిరింపులు చేసిన కేటుగాడి కోసం పోలీసులు వేట మొదలు పెట్టాడు. అర్దరాత్రి కేటుగాడు ఏం చేశాడో తెలుసుకున్న ప్రజలు షాక్ అయ్యారు.

అర్దరాత్రి ఏం జరిగిందంటే ?
శుక్రవారం అర్దరాత్రి ముంబాయి సిటీ పోలీసులు ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. అర్దరాత్రి ముంబాయి పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసిన గుర్తు తెలియన వ్యక్తి మేము ముంబాయి సిటీలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లు, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంటిని బాంబులతో పేల్చేస్తున్నామని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేశారు.

పోలీసులు పరుగో.... పరుగు
విషయం తెలుసుకున్న పోలీసులు, డాగ్ స్వ్కాడ్ సిబ్బంది, బాంబు డిస్పోజల్ స్వ్కాడ్ సిబ్బంది ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, దాదార్ రైల్వేస్టేషన్, బైకుల్లా తదితర రైల్వే స్టేషన్ల దగ్గరకు పరుగు తీశారు. ముంబాయిలోని జాహు ప్రాంతంలో నివాసం ఉంటున్న బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంటి దగ్గరకు పోలీసులు పరుగు తీశారు.

అణువణువు పరిశీలించిన పోలీసులు
ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, దాదార్ రైల్వేస్టేషన్, బైకుల్లా తదితర రైల్వే స్టేషన్లల్లో, పరిసర ప్రాంతాలు, బైక్ పార్కింగ్, కారు పార్కింగ్ లతో పాటు అన్ని చోట్లు పోలీసులు, బాంబు నిర్వీర్య దళం సిబ్బంది, డాగ్ స్వ్కాడ్ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనపడకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

హడలిపోయిన ప్రయాణికులు
ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, దాదార్ రైల్వేస్టేషన్, బైకుల్లా తదితర రైల్వే స్టేషన్లల్లో, పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఒక్కసారిగా సోదాలు చెయ్యడంతో మొదట ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అయితే బాంబు బెదిరింపులు వచ్చాయని తెలుసుకున్న రైల్వే ప్రయాణికులు ఎప్పుడు ఏమి జరుగుతుందో అంటూ టెన్షన్ తో హడలిపోయారని సమాచారం.

బిగ్ బి ఇంటి దగ్గర భారీ బందోబస్తు
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇంటి దగ్గర ఎలాంటి అనుమానాస్పద వస్తువులు చిక్కలేదని ఓ పోలీసు అధికారి మీడియాకు చెప్పారు. అయితే ముందు జాగ్రత్తగా అమితాబ్ బచ్చన్ ఇంటితో పాటు జాహూ ప్రాంతంలో ముంబాయి పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముంబాయిలోని ప్రధాన రైల్వే స్టేషన్లతో పాటు వీఐపీలు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో సంచరిస్తున్న వాహనాలను తనిఖీలు చేస్తున్నారు.

ఎవడో కాని చిక్కితే..... వాడికి ఉంటుంది నాసామిరంగా !
పోలీసు కంట్రోల్ రూమ్ బాంబు బెదిరింపుల ఫోన్ ఎవరు చేశారు ?, ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటూ పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. బాంబు బెదిరింపుల ఫోన్ చేసిన వాడు ఎవడో కాని వాడు చిక్కితో కచ్చితంగా చిత్రాన్నం తినింపించడానికి సిద్దంగా ఉన్నారని, వాడి కథ కంచికి పోతుందని ముంబాయి పోలీసులు అంటున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications