పుణె గూగుల్ ఆఫీస్‌కు బాంబు బెదిరింపు కాల్: హైదరాబాద్‌లో వ్యక్తి అరెస్ట్
మహారాష్ట్ర పుణెలోని గూగుల్ సంస్థ కార్యాలయానికి బెదిరింపు ఫోన్ వచ్చిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంగణాన్ని తనిఖీ చేశారు. కాల్ చేసిన హైదరాబాద్ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
పుణె: ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కార్యాలయంలో బాంబు ఉందంటూ వచ్చిన ఓ బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. మహారాష్ట్ర పుణెలోని గూగుల్ సంస్థ కార్యాలయానికి బెదిరింపు ఫోన్ వచ్చిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంగణాన్ని తనిఖీ చేశారు. అయితే, ఇది ఫేక్‌కాల్ అని పోలీసులు తేల్చారు.
అయితే, కాల్ చేసింది ఎవరనేదానిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. హైదరాబాద్ నుంచి ఆ బెదిరింపు కాల్ వచ్చినట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌లో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ఆదివారం రాత్రి 7.54 నిమిషాలకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. పుణెలోని ముంధ్వా ప్రాంతంలో ఉన్న గూగుల్ సంస్థ కార్యాలయంలో బాంబు ఉన్నట్లు ఫోన్ చేసిన వ్యక్తి తెలిపాడు. ఈ క్రమంలో గూగుల్ సిబ్బంది వెంటనే స్థానిక బీకేసీ పోలీసులు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు.. పుణె పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానిక పోలీసులతో పాటు బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ కార్యాలయానికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. చివరకు ఫేక్‌కాల్‌గా ధృవీకరించిన పోలీసులు.. కాల్ హైదరాబాద్ నుంచి వచ్చినట్లు కనుగొన్నారు.
ఈ నేపథ్యంలో కాల్ చేసిన వ్యక్తిని సోమవారం హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని హైదరాబాద్ నగరంలోని అతని ఇంటి నుంచే అరెస్ట్ చేశారు. మద్యం మత్తులోనే ఆ వ్యక్తి బెదిరింపు కాల్ చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. దీనిపై అతడ్ని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications