ఆర్యన్ బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆరఖాన్ వాట్సాప్ ఛాట్ లో కుట్ర లేదు- బోంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ముంబై తీరంలో క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ ఎన్సీబీ అధికారులకు దొరికిన ఆర్యన్ ఖాన్ వాట్సాప్ ఛాట్ ఈ కేసులో కీలకంగా మారింది. ఇందులో ఆర్యన్ కుట్రకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నట్లు గతంలో ఎన్సీబీ ఆరోపించింది. కానీ ఈ ఆరోపణల్ని బోంబే హైకోర్టు తాజాగా తోసిపుచ్చింది.

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అతను తన మిత్రులు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలతో చేసిన వాట్సాప్ ఛాట్ కీలకమని ఎన్సీబీ గతంలో పేర్కొంది. ఇందులో అతను డ్రగ్స్ డీలర్లతో పెట్టుకున్న సంబంధాలు, కుట్రకు పాల్పడటం వంటి ఆరోపణలు చేసింది. వీటిపై బోంబే హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. అనంతరం ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేస్తూ బోంబే హైకోర్టు నిర్ణయం తీసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా బయటికి వచ్చాయి.

bombay high court says no evidence of aryan khans conspiracy in drugs case

క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు బాంబే హైకోర్టు వివరణాత్మక బెయిల్ ఆర్డర్‌ను ఇవాళ విడుదల చేసింది. ఇందులో ఆర్యన్ ఖాన్ "ఏ విధమైన అభ్యంతరకరమైన పదార్థాన్ని కలిగి ఉన్నట్లు కనుగొనబడలేదని తెలిపింది. అలాగే ఈ కేసులో ఇతర నిందితులైన ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్ మరియు మున్మున్ ధమేచా మధ్య కుట్రకు ఎటువంటి ఆధారాలు దొరకలేదని కూడా బోంబే హైకోర్టు ఈ ఉత్తర్వులో పేర్కొంది. దీంతో ఇన్నాళ్లూ వీరికి వ్యతిరేకంగా ఎన్సీబీ చేస్తున్న వాదన పసలేనిదని తేలిపోయింది. హై ప్రొఫైల్ కేసులో ఆర్యన్ ఖాన్ ప్రమేయంపై ఎన్సీబీ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. అలాగే దీనిపై మహారాష్ట్ర సర్కార్ సైతం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఎన్సీబీ అధికారిగా ఉన్న సమీర్ వాంఖడే కూడా ఈ వివాదంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొని బదిలీ కూడా అయ్యారు. చివరికి బోంబే హైకోర్టు వాటిని తోసిపుచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+