అక్రమ సంబంధం మ్యాటర్ లీక్ చేశాడని కోపం, రాత్రి గన్ తో ప్రియుడు ?
చెన్నై/ పెరంబలూరు: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో చక్కగా కాపురం చేస్తున్నాడు. దంపతులకు పిల్లలు ఉన్నారు. భార్యకు తెలీకుండా భర్త వేరే అమ్మాయితో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే తన అక్రమ సంబంధం గురించి అందరికి తెలిసిపోవడానికి ఓ యువకుడు కారణం అని రిగిలిపోయిన ప్రియుడు రివాల్వర్ తో ఓ యువకుడిని కాల్చి చంపడం కలకలం రేపింది.
తమిళనాడులోని పెరంబలూరు జిల్లాలోని మంగళమేడు సమీపంలోని నమైయూర్ గ్రామానికి చెందిన అజిత్ (26)కు ఇప్పటికే వివాహమై భార్య చనిపోయింది. రెండు నెలల క్రితం మరో మహిళను అజిత్ రెండో పెళ్లి చేసుకున్నాడు. అదే ఊరికి చెందిన సుబ్రమణి కుమారుడు రజిని(45)కి జయంతి అనే మహిళతో చాలా సంవత్సరా క్రితం వివాహం అయ్యింది. రజని, జయంతి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

రజనీకి అదే ప్రాంతానికి చెందిన మరో అమ్మాయికి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. రజని, ఆమె ప్రియురాలు నిత్యం ఏకాంతంగా కలుసుకునేవారు. దీన్ని ఆ ప్రాంత ప్రజలు చూడడంతో ఊరు అందరికి తెలిసిపోయింది. రజనికి, మరో యువతికి అక్రమ సంబందం ఉన్న విషయం అజిత్‌కి కూడా తెలిసింది. తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో తన అక్రమ సంబందం గురించి ప్రచారం చేసింది అజిత్ అని భావించిన రజినీ అజిత్‌తో వాగ్వాదానికి దిగాడు.

ఉదయం నుంచి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో సోమవారం రాత్రి అజిత్ అతని ఇంటికి కొంత దూరంలో వెలుతున్న విషయం గమనించిన రజని అతన్ని నిర్జనప్రదేశం వరకు వెంబడించాడు. రజనీ అతని దగ్గర ఉన్న కంట్రీ మేడ్ గన్‌తో అజిత్ ను కాల్చాడు. రజనీ తలలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో అతను అక్కడే కుప్పకూలిపోయాడు.
తుపాకి శబ్ధం విని పరిగెత్తి వచ్చిన ఇరుగుపొరుగు వారిని చూసిన రజనీ తన దగ్గరకు ఎవరైనా వస్తే ఇదే తుపాకితో కాల్చి చంపేస్తానని బెదిరించి తుపాకీతో అక్కడి నుంచి పారిపోయాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అజిత్‌ను అతని బంధువులు 108 వాహన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 108 వాహనం సిబ్బంది వెళ్లి చూసేసరికి అజిత్ మృతి చెందాడని పోలీసులు అన్నారు.
మంగళమేడు పోలీసులు అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పెరంబలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అలాగే అజిత్ తల్లి రాధ(60) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మంగళమేడు పోలీసులు రజనీ చేతికి కంట్రీమేడ్ తుపాకీ ఎలా వచ్చింది, అతను ఎక్కడ ఉన్నాడు అని గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications