వధువుకు స్టేజ్ మీదే వరుడి ముద్దు- హర్ట్ అయి పెళ్లి క్యాన్సిల్- అక్కడే భారీ ట్విస్ట్ !
యూపీలోని సంభాల్ లో తాజాగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని సంభాల్ లో ఓ పెళ్లి జరుగుతున్న సమయంలో వేదికపై ఉన్న వరుడు, అక్కడే ఉన్నవధువును బహిరంగంగా ముద్దు పెట్టుకున్నాడు. ఎలాగో కాబోయే భార్యే కదా అని అనుకున్నాడో ఏమో పబ్లిగ్గానే ముద్దు పెట్టుకున్నాడు. అయితే సీన్ రివర్స్ అయింది.
యూపీలోని బరేలీలోని సంభాల్ లో ఓ పెళ్లి జరుగుతోంది. దీనికి 300 మంది వరకూ అతిధులు హాజరయ్యారు. పెళ్లి స్టేజ్ పై వధూవరులు దండలు మార్చుకుంటున్నారు. ఆ వెంటనే వరుడు ఆమెను ముద్దాడాడు. దీంతో స్టేజ్ పై నుంచి దిగి వెళ్లిపోయిన వధువు పోలీసుల్ని పిలుచుకుని వచ్చింది. దీంతో కాబోయే భర్త పబ్లిగ్గా ఆమెకు ముద్దు పెట్టడం ఇష్టం లేక అవమానంతో అలా చేసిందని అంతా భావించారు. కానీ ఆమె ఏకంగా పెళ్లి రద్దు చేసేసుకుంది. పోలీసులు వచ్చి ఆ తర్వాత విచారణ కూడా జరిపారు.

చివరికి మరో కొత్త విషయం తేలింది. వరుడు తన ఫ్రెండ్స్ తో కలిసి ఓ బెట్టు కట్టాడు. పెళ్లి కుమార్తెను స్టేజ్ మీదే ముద్దు పెట్టుకుంటానని ఆ బెట్టు. దీంతో అనుకున్నట్లుగానే పెళ్లి కూతుర్ని దండలు మార్చుకోగానే ముద్దు పెట్టేశాడు. దీంతో విషయం గ్రహించిన పెళ్లి కూతురు దీన్నో అవమానంగా భావించింది. కాబోయే భర్త ముద్దు పెట్టడం తప్పుకాదని, కానీ ఫ్రెండ్స్ తో పందెం కట్టి, దాన్ని నెగ్గేందుకు తనను పబ్లిగ్గా ముద్దు పెట్టడం సరికాదని ఆమె భావించింది. దీంతో గ్రాడ్యుయేట్ అయిన ఆ వధువు నిర్దాక్షిణ్యంగా పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోవడమే కాకుండా సదరు వరుడిపై కేసు కూడా పెట్టించింది.
కేసు విచారణకు ఇరువర్గాల్ని పోలీసులు స్టేషన్ కు రప్పించారు. విచారణలో వధువు జరిగిందేంటో చెప్పింది. వరుడు తనను పబ్లిగ్గా ముద్దు పెట్టుకుని అవమానించాడని, ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తు ఏంటనే భయంతోనే పెళ్లి రద్దు చేసుకుంటున్నానని, ఇక అతనితో వెళ్లేది లేదని తేల్చిచెప్పేసింది. అయితే పోలీసులు మాత్రం చట్టప్రకారం పెళ్లి పూర్తయిందని, చివర్లో అనుకోని ఘటన జరగడంతో ఇప్పుడు ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నట్లు తెలిపారు. కొన్ని రోజులు వేసి చూసి నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications