Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

viral video: ఈ పెళ్లి కూతురు సూపర్, జైమాల వేడుకలో ట్విస్ట్, పెళ్లి వద్దట.. కారణమిదే..?

పెళ్లి అంటే.. రెండు జీవితాలు, ఇద్దరు మనసులు కలిస్తేనే.. సుఖం, సంతోషం. దాదాపు మెజార్టీ అరెంజ్డ్ మ్యారేజ్‌.. కొన్ని మాత్రమే ప్రేమ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. లవ్ మ్యారేజ్ అంటే ఇద్దరూ అన్నీ ఆలోచించి ముందడుగు వేస్తారు. పెద్దలు కుదిర్చిన వివాహాంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయి. విద్య, ఉద్యోగం.. రకరకాల సమస్యలు.. అయినప్పటికీ కొందరు సర్దుకుంటారు. మరికొందరు తెగిస్తారు. అలా ఓ పెళ్లి కూతురు ధైర్యం చేశారు. జై మాల వేడుక జరిగే సమయంలో తనకు ఇతనితో పెళ్లి వద్దని చెప్పేసింది. ఆ వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతుంది.

పెళ్లి జరిగే సమయంలో.. ముఖ్యంగా హిందూ సంప్రాదాయం ప్రకారం కట్నం, కానుకల విషయంలో గొడవలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఓ పెళ్లి కూతురు మాత్రం తనకు అతనితో వివాహం వద్దని తెగేసి చెప్పింది. ఎందుకంటే అతను చదువుకోలేదు అని తెగేసి చెప్పింది. జై మాల వేడుకలో.. వరుడు వధువు మెడలో దండ వేసిన సందర్భంలో ఈ ఘటన జరిగింది. తిరిగి ఆమె దండ వేయాల్సి ఉంది. అప్పుడు తన మనస్సులో రగులుతున్న బాధను ఆమె వ్యక్తం చేసింది. తనకు ఈ పెళ్లి వద్దని చెప్పింది. ఎందుకంటే అతను చదువుకోలేదని తెలియజేసింది. దీంతో అక్కడున్న వారంతా షాక్‌నకు గురయ్యారు.

పెళ్లి జరిగే సమయంలో వరుడు తరపు వారు సవాలక్ష సందేహాలు వ్యక్తం చేస్తారు. మరీ ఇక్కడ వధువు ధైర్యం చేసింది. అదీ కూడా తనకు నచ్చిన జీవితం కోసం ఇలా చేసింది. తాను చదువుకున్న వ్యక్తిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పింది. దీంతో ఇద్దరం సమానం అని.. ఎక్కువ, తక్కువ అనే భేదం ఉండబోదు అని చెప్పింది. వధువు బీఎడ్ చేసింది. తనకు కాబోయే భర్త కూడా అదేవిధంగా చదవాలని ఆమె ఆకాంక్షించింది. తనతో అతను ఇంగ్లిషులో మాట్లాడాలని సూచించింది.

మరీ ఇప్పుడు ఎందుకు చెబుతున్నావ్.. పెళ్లికి ముందే చెప్పొచ్చు కదా అని ఒకరు అడిగారు. ముందే చెప్పానని యువతి వెల్లడించింది. కానీ తన తండ్రి ఒప్పుకోలేదని తెలియజేసింది. ఇక ఇప్పుడు జై మాల జరిగిపోతే.. తన జీవితం ముగిసినట్టేనని భావించి ఇలా చేసింది. వధువుకు ఇంటర్నెట్ క్లప్స్ కొడుతుంది. వావ్ యు ఆర్ గ్రేట్ అంటూ ప్రశంసిస్తోంది.

Bride Stops Her Own Marriage Saying That She Wants To Marry Only An Educated Guy Video Goes Viral On Social

యువతి ధైర్యవంతురాలు, సెల్యూట్.. అతనిని పెళ్లి చేసుకోవద్దు అని కామెంట్ చేస్తున్నారు. చదువుకొని భర్త వేస్ట్ అనేలా చెప్పారు. మనీ ముఖ్యం కానే కాదు అని.. ఇద్దరు సమానంగా ఉండాలని.. అర్థం చేసుకోవడం ముఖ్యం అని చెప్పారు. ఆ యువతి చేసిన పని హ్యాట్సాప్ అంటూ మరొకరు కొనియాడారు. విద్య ముఖ్యం అని.. నగదు ఇంపార్టెంట్ కానే కాదని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+