Brother: పెళ్లి చేసి ఆస్తి భాగం పెట్టుకుండా అన్న మోసం చేస్తున్నాడు. బాత్ రూమ్ లో తమ్ముడు ? !
ఆస్తి మొత్తం అన్న చేతిలో ఉందని, తనకు పెళ్లి చెయ్యకుండా ఆస్తి మొత్తం అన్న అనుభవిస్తున్నాడని తమ్ముడు రగిలిపోయాడు. ఆవేశంతో తమ్ముడు ఊగిపోయాడు. పెళ్లి కోసం, ఆస్తి కోసం అన్నదమ్ములు గొడవపడి ఒకరు హత్యకు గురికావడం కలకలం రేపింది.
బెంగళూరు/ కోప్పళ: పెళ్లి చేసుకుంటేనే తండ్రి ఆస్తి వస్తుందని బంధువులు, కుటుంబ సభ్యులు ఓ యువకుడికి చెప్పారు. చిన్న కొడుక్కి పెళ్లి జరిగిన తరువాతే ఆస్తి పంపకాలు జరగాలని తండ్రి చనిపోయే ముందు కుటుంబ సభ్యులు అందరి దగ్గర మాట తీసుకున్నాడు. అయితే ఆస్తి మొత్తం అన్న చేతిలో ఉందని, తనకు పెళ్లి చెయ్యకుండా ఆస్తి మొత్తం అన్న అనుభవిస్తున్నాడని తమ్ముడు రగిలిపోయాడు. ఆవేశంతో తమ్ముడు తీసుకున్న నిర్ణయానికి అన్న ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పెళ్లి కోసం, ఆస్తి కోసం అన్నదమ్ములు గొడవపడి ఒకరు హత్యకు గురికావడం కలకలం రేపింది.

అన్నను చంపిన తమ్ముడు
పెళ్లి చెయ్యడం లేదని, తండ్రి ఆస్తిని పంచడంలేదని సొంత అన్నను అతని తమ్ముడు కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన కర్ణాటకలోని కోప్పళ జిల్లాలోని కుష్టగి తాలూకాలోని పట్లచింటి గ్రామంలో జరిగింది.
యమనూరప్ప కడివాలా అలియాస్ యమనూరప్ప (37) అనే వ్యక్తి హత్యకు గురైనాడు. అన్నను హత్య చేసిన మల్లప్ప కడివాల అలియాస్ మీద హనుమసాగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఆస్తి పంచిపెట్టాలని కాళ్లుపట్టుకున్న తమ్ముడు
తనకు పెళ్లి చేసి పిత్రార్జిత ఆస్తిలో వాటా ఇవ్వాలని మల్లప్ప అతని అన్న యమనూరప్పకు చాలా సార్లు మనవి చేశాడు. అయితే తమ్ముడు మల్లప్పకు ఆస్తి పంచడానికి పెళ్లి చెయ్యడానికి యమనూరప్ప పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలిసింది. నా ఆస్తి నాకు ఇవ్వాలని మల్లప్ప అతని అన్న కాళ్లు పట్టుకుని అతన్ని వేడుకున్నాడు. అయితే అందరూ కలిసి మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని మల్లప్ప ముందుకొచ్చినా అతని అన్న మాత్రం కాలం గడుపుతూ వచ్చాడు.

సొంత అన్నదమ్ముల మధ్య ద్వేషం
పెళ్లి విషయంలో, ఆస్తి పంపకాల విషయంలో యమనూరప్ప, అతని తమ్ముడు మల్లప్పల మధ్య రానురాను ద్వేషం పెరిగింది. రాత్రి యమనూరప్ప పని ముగించుకుని వచ్చి ఇంట్లోని బాత్‌రూమ్‌లో ముఖం కడుక్కుంటున్నాడు. ఆ సమయంలో ఇంటి బయట ఉన్న మల్లప్ప కత్తితో అతని అన్న యమనూరప్పను దారుణంగా పొడిచి చంపేశాడు.

అందుకే చంపేశాను
విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితుడు మల్లప్పను శనివారం హనుమానాల గ్రామంలో అరెస్టు చేశారు. మృతుడు యమనూరప్ప భార్య ఫిర్యాదు మేరకు హనుమసాగర్ పోలీస్ స్టేషన్‌లో మల్లప్ప మీద కేసు నమోదు అయ్యింది. పోలీసులు నిందితుడు మల్లప్పను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. తనకు పెళ్లి చెయ్యకుండా, తన ఆస్తిని తనకు పంచకుండా తన అన్న ఇంతకాలం తనకు నరకం చూపించాడని, అందుకే చంపేశానని తమ్ముడు మల్లప్ప అంటున్నాడని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications