సొంత సోదరిపై అత్యాచారం చేసిన సోదరులు
ముంబై: సొంత సోదరిని బెదిరించి సామూహిక అత్యాచారం చేస్తున్న ఇద్దరు మైనర్లను ముంబై నగర పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిని బాలల రిమాండ్ హోంకు తరలించామని పోలీసు అధికారులు చెప్పారు. బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరిక్షలు చేయించారు.
ముంబై నగరంలో (14) ఏళ్ల బాలిక నివాసం ఉంటున్నది. ఈమెకు (17), (12) ఏళ్లు ఉన్న ఇద్దరు సోదరులు ఉన్నారు. బాలిక తల్లిదండ్రులు కూలి పని చేస్తున్నారు. గత ఏడాది దీపావళి సెలవుల సమయంలో తన అన్న (17) లైంగిక వేదింపులకు దిగాడని బాలిక ఆరోపిస్తున్నది.

తన మీద పలు సార్లు అత్యాచారం చేశాడని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొంత కాలానికి తన తమ్ముడు ఇదే పని మొదలు పెట్టాడని బాలిక పోలీసులకు చెప్పింది. కూలి పని చేసుకునే తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పలేక తాను ఇంతకాలం కుమిలిపోయానని బాలిక పోలీసులకు చెప్పింది.
బాలిక తన స్కూల్ లోని క్లాస్ టీచర్ కు విషయం చెప్పడంతో అసలు విషయం వెలుగు చూసిందని పోలీసులు అన్నారు. బాధితురాలి ఇద్దరు సోదరులను భివాండీలోని రిమాండ్ హోం కు తరలించామని పోలీసులు అన్నారు. బాలికకు వైద్యపరిక్షలు చేయించామని, నివేదిక వచ్చిన తరువాత అసలు విషయాలు తెలుస్తాయని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications