Brothers: ఒకే ఇల్లు, భార్యల మీద డౌట్, వదినతో మరిది, మరదలితో బావ ? కట్ చేస్తే నడిరోడ్డులో, భార్యకు !

బెంగళూరు/బెళగావి: అన్న పెళ్లి చేసుకున్నాడు. కొన్ని ఏళ్ల తరువాత తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు. సొంత ఇంటిలో మూడు అంతస్తుల్లో అన్నదమ్ములు ఇద్దరూ వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. అన్నదమ్ములతో పాటు వారి తల్లిదండ్రులు మరో అంతస్తులో అక్కడే నివాసం ఉంటున్నారు. అన్నా, తమ్ముడు ఎక్కువగా బయట తిరుగుతున్నారు. తన అన్న తన భార్యతో అక్రమ సంబందం పెట్టుకున్నాడని తమ్ముడు రగిలిపోయాడు. తన తమ్ముడు తన భార్యతో రొమాన్స్ చేస్తున్నాడని అన్న గొడవ చేశాడు. ఇదే విషయంలో ఇప్పటికే పెద్దలు చాలాసార్లు అన్నాతమ్ముడి మద్య పంచాయితీలు చేశారు. ఇంత జరుగుతున్నా అన్నదమ్ములు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. అక్రమ సంబంధం విషయంలో పక్కాస్కెచ్ తో నడిరోడ్డు మీద ఒకరు హత్యకు గురికావడం కలకలం రేపింది.

అన్నదమ్ముల కాపురాలు

అన్నదమ్ముల కాపురాలు

కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని చిక్కోడి పట్టణంలో అక్బర్ షేక్ (40), అతని తమ్ముడు అహమ్మద్ షేక్ (36) నివాసం ఉంటున్నారు. అక్బర్ షేక్ కు వివాహం అయ్యింది. కొన్ని సంవత్సరాల తరువాత అహమ్మద్ షేక్ కూడా పెళ్లి చేసుకున్నాడు. సొంత ఇంటిలో రెండు అంతస్తుల్లో అన్నదమ్ములు అక్బర్ షేక్, అహమ్మద్ షేక్ ఇద్దరూ వేర్వేరుగా నివాసం ఉంటూ వారి భార్యలతో సంసారం చేస్తున్నారు.

నా భార్యతో అన్నకు అక్రమ సంబందం ?

నా భార్యతో అన్నకు అక్రమ సంబందం ?

అన్నదమ్ములు అక్బర్ షేక్, అహమ్మద్ సేక్ తో పాటు వారి తల్లిదండ్రులు అదే ఇంటిలో నివాసం ఉంటున్నారు. వ్యాపారం పనుల మీద అన్నా అక్బర్ షేక్, అతని తమ్ముడు అహమ్మద్ షేక్ ఎక్కువగా బయట తిరుగుతున్నారు. తాను ఇంట్లో లేని సమయంలో తన అన్న అక్బర్ షేక్ తన ఇంటికి వచ్చిన తన భార్యతో అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడని అహమ్మద్ షేక్ రగిలిపోయాడు.

వదినతో తమ్ముడు రొమాన్స్ చేస్తున్నాడని అన్నకు డౌట్

వదినతో తమ్ముడు రొమాన్స్ చేస్తున్నాడని అన్నకు డౌట్

తాను వ్యాపారం పని మీద బయటకు వెళ్లిన తరువాత తన తమ్ముడు అహమ్మద్ షేక్ తన భార్యతో రొమాన్స్ చేస్తున్నాడని అక్బర్ షేక్ కు అనుమానం వచ్చింది. తన తమ్ముడు అహమ్మద్ షేక్ తన భార్యతో రొమాన్స్ చేస్తున్నాడని అతని అన్న అక్బర్ షేక్ గొడవలు చెయ్యడం మొదలుపెట్టాడు. ఇదే విషయంలో ఇప్పటికే పెద్దలు చాలాసార్లు అక్బర్ షేక్, అహమ్మద్ షేక్ ల మద్య పంచాయితీలు చేసినా వారు మాత్రం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

అన్నను చంపడానికి కారు కొన్నాడు

అన్నను చంపడానికి కారు కొన్నాడు

తన అన్న అక్బర్ షేక్ తన భార్యను వదిలిపెట్టడని, వాడిని చంపేయాలని సొంత తమ్ముడు అహమ్మద్ షేక్ డిసైడ్ అయ్యాడు. అన్నను హత్య చెయ్యడానికి తమ్ముడు అహమ్మద్ షేక్ సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేశాడు. అన్న అక్బర్ షేక్ ను రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు చిత్రీకరించాలని స్కెచ్ వేశాడు.

బతికిపోయిన అన్న

బతికిపోయిన అన్న

అక్బర్ బైక్ లో చిక్కోడి నుంచి వేరే ఊరికి బయలుదేరాడు. అక్బర్ బైక్ ను అతని తమ్ముడు అహమ్మద్ షేక్ కారులో వెంబడించాడు. ఉమారాణి గ్రామం సమీపంలో వెనుక నుంచి వేగంగా కారుతో అన్న అక్బర్ షేక్ బైక్ ను ఢీకొన్నాడు. అయితే అక్బర్ షేక్ రోడ్డు పక్కకు పడిపోవడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు.

నడిరోడ్డులో అన్నను నరికేశాడు

నడిరోడ్డులో అన్నను నరికేశాడు

అన్న బతికిపోయాడని రగిలిపోయిన అహమ్మద్ షేక్ కారులో నుంచి పదునైన కొడవలి తీసుకెళ్లి అతని అన్న అక్బర్ షేక్ తల మీద ఇష్టం వచ్చినట్లు దాడి చెయ్యడంతో నడిరోడ్డులో అతని ప్రాణాలు పోయాయి. అన్న అక్బర్ షేక్ శవాన్ని రోడ్డు పక్కకు లాగేసిన అహమ్మద్ షేక్ నేరుగా కారులో ఇంటికి వెళ్లాడు.

నువ్వు మాత్రం మిగిలిపోయావు అని భార్యకు వార్నింగ్

నువ్వు మాత్రం మిగిలిపోయావు అని భార్యకు వార్నింగ్

మా అన్న అక్బర్ షేక్ ను చంపేశాను, ఇక నువ్వు మాత్రం మిగిలావు అని భార్యకు చెప్పిన అహమ్మద్ షేక్ నేరుగా చిక్కోడి పోలీస్ స్టేన్ కు వెళ్లి లొంగిపోయాడు. నా భార్యతో రొమాన్స్ చేస్తున్న మా అన్న అక్బర్ షేక్ ను చంపేశాను అని అహమ్మద్ షేక్ చెప్పడంతో పోలీసులు హడలిపోయారు. పోలీసులు అక్బర్ శవాన్ని స్వాధీనం చేసుకుని కేసు విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+