మీరు టెన్త్ పాస్ అయ్యారా..? అయితే 69,000 జీతం ఉద్యోగం మీదే
మీరు పదవ తరగతి (టెన్త్) పాసై, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే, దేశ సేవలో పాలుపంచుకునే అద్భుత అవకాశం మీకోసం వచ్చింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) స్పోర్ట్స్ కోటా కింద కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ - GD) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సూపర్ ఛాన్స్‌ను అస్సలు మిస్ చేసుకోవద్దు.
మొత్తం పోస్టులు 391 కాగా, కేవలం 10వ తరగతి అర్హతతోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఇది స్పోర్ట్స్ కోటా కింద జరుగుతున్న నియామకం కాబట్టి, దరఖాస్తుదారులు గత రెండేళ్లలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ గుర్తింపు పొందిన అంతర్జాతీయ క్రీడలో ప్రాతినిధ్యం వహించి లేదా పతకం గెలుచుకొని ఉండాలి.

ముఖ్య వివరాలు:
అర్హత: 10వ తరగతి పాస్ + అంతర్జాతీయ క్రీడా అనుభవం.
వయస్సు పరిమితి: 18 నుండి 23 సంవత్సరాలు (ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు సడలింపు ఉంటుంది).
జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹21,700 నుండి ₹69,100 వరకు జీతం లభిస్తుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ పురుష అభ్యర్థులకు ₹159.
చివరి తేదీ ఎప్పుడు?
ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు వెంటనే స్పందించాలి! దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 4, 2025 రాత్రి 11:59 గంటల వరకు మాత్రమే సమయం ఉంది. వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, దేశ రక్షణ బాధ్యతలో పాలుపంచుకునే ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.












Click it and Unblock the Notifications