Businessman: ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాధించాలి, భార్య, కొడుకును చంపేసిన వ్యాపారి !

భువనేశ్వర్: వ్యాపారం చేస్తున్న యువకుడు ఇంట్లో చూసిన అందమైన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. భార్యతో చక్కగా కాపురం చెయ్యడంతో ఓ కొడుకు పుట్టాడు. వ్యాపారంలో డబ్బులు బాగా సంపాధిస్తున్న వ్యక్తి అతని భార్య, కొడుకును ఏమి అడిగినా లేదనకుండా, కాదనకుండా తీసిచ్చాడు. వ్యాపారంలో బాగా డబ్బు సంపాధిస్తున్న అతను షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాడు. షేర్ మార్కెట్ లో రూ. లక్షలు లక్షలు పెట్టుబడులు పెట్టడంతో నష్టాలు వచ్చాయి. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాధించాలని మొండిగా అతను మళ్లీ షేర్ మార్కెట్ లో గుడ్డిగా పెట్టుబడులు పెట్టాడు. షేర్ మార్కెట్ లో నస్టాలు రావడం, అప్పులు ఇచ్చిన వారు నెత్తిన కూర్చోవడంతో ఆ వ్యాపారి విసిగిపోయాడు. దీపావళి పండుగ పూట ఇంట్లో సంతోషంగా గడపాలని అన్ని పనులు చేసుకుంటున్న భార్యను, కొడుకును చంపేసిన వ్యాపారి అతను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.

 మంచి వ్యాపారం చేసేవాడు

మంచి వ్యాపారం చేసేవాడు

ఒడిస్సాలోని భువనేశ్వర్ లో కళింగ నగర్ లోని కే-4 ఏరియాలో అంబటి బిజయ్ మంగరాజ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. వ్యాపారం చేస్తున్న అంబటి బిజయ్ ఇంట్లో చూసిన అందమైన స్వర్ణలత అనే అమ్మాయిని 12 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. భార్య స్వర్ణలతతో చక్కగా కాపురం చేసిన అంబటి బిజయ్ ఓ కొడుకుకు తండ్రి అయ్యాడు. మంచి వ్యాపారం చేస్తున్న అంబటి బిజయ్ డబ్బులు బాగా సంపాధించాడు.

 ఫేర్ మార్కెట్ ల మీద మోజు

ఫేర్ మార్కెట్ ల మీద మోజు

వ్యాపారంలో డబ్బులు బాగా సంపాధిస్తున్న అంబటి బిజయ్ అతని భార్య స్వర్ణలత, అతని కొడుకును ఏమి అడిగినా లేదనకుండా, కాదనకుండా తీసిచ్చాడు. వ్యాపారంలో బాగా డబ్బు సంపాధిస్తున్న అంబటి బిజయ్ షేర్ మార్కెట్ లమీద మోజుతో అందులో పెట్టుబడులు పెట్టాడు. షేర్ మార్కెట్ లో రూ. లక్షలు లక్షలు పెట్టుబడులు పెట్టడంతో అంబటి బిజయ్ కి నష్టాలు వచ్చాయి.

 ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాధించాలి

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాధించాలి

రానురాను అంబటి బిజయ్ షేర్ మార్కెట్ లో రూ. లక్షలు లక్షలు పెట్టుబడులు పెట్టడం, తరువాత నష్టాలు రావడం జరిగిపోయింది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాధించాలని అంబటి బిజయ్ మొండిగా అతను మళ్లీ షేర్ మార్కెట్ లో గుడ్డిగా పెట్టుబడులు పెట్టాడు. షేర్ మార్కెట్ లో పెట్టబడులు పెట్టడానికి అంబటి బిజయ్ తెలిసిన వారి దగ్గర మొత్తం అప్పులు చేసేశాడు.

 అప్పులు ఇచ్చిన వారు పీడించేశారు

అప్పులు ఇచ్చిన వారు పీడించేశారు

చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక అంబటి బిజయ్ నానా ఇబ్బందులు పడ్డాడు. అంటి బిజయ్ షేర్ మార్కెట్ నష్టాలతో పీకలలోతు వరకు ముగినిపోయాడని అతని బంధువులు, స్నేహితులు అందరికి తెలిసిపోయింది. బిజయ్ కి కొత్తగా అప్పలు ఇచ్చేవారు కరువైనారు. షేర్ మార్కెట్ లో నస్టాలు రావడం, అప్పులు ఇచ్చిన వారు అంబటి బిజయ్ నెత్తిన కూర్చోవడంతో ఆ వ్యాపారి విసిగిపోయాడు. మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయాలని అందరూ అంబటి బిజయ్ మీద ఒత్తిడి చేశారు.

 భార్య, కొడుకును చంపేసిన వ్యాపారి

భార్య, కొడుకును చంపేసిన వ్యాపారి

తాను ఆత్మహత్య చేసుకుంటే అప్పులు ఇచ్చిన వాళ్లు తన భార్య స్వర్ణలత మీద ఒత్తిడి చేస్తారని అంబటి బిజయ్ భయపడ్డాడు. దీపావళి పండుగ పూట ఇంట్లో సంతోషంగా గడపాలని అన్ని పనులు చేసుకుంటున్న భార్య స్వర్ణలతను, కొడుకును గొంతునులిమి చంపేశాడు. తరువాత కత్తితో పొడుచుకుని అంబటి బిజయ్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు, అయితే ప్రాణాలు పోలేదని అంబటి బిజయ్ ఇంటి నుంచి పారిపోయాడు.

Recommended Video

    అనేక ఆకృతుల్లో కనువిందు చేస్తున్న దీపాలు వెలిగించే ప్రమిదలు!! || Oneindia Telugu
     ఏం చెయ్యాలో తెలీక తిరిగేశాడు

    ఏం చెయ్యాలో తెలీక తిరిగేశాడు

    జంట హత్యలు జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు స్వర్ణలత, ఆమె కొడుకు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. భార్య స్వర్ణలత, కొడుకును హత్య చేసి ఏం చెయ్యాలో తెలీక తప్పించుకుని తిరుగుతున్న అంబటి బిజయ్ ని పోలీసులు అరెస్టు చేశారు. భార్య, కొడుకును దీపావళి పండుగ పూట హత్య చేసిన వ్యాపారి అతను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం ఒడిస్సాలో కలకలం రేపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+