మసాజ్‌కు వచ్చి కోరిక తీర్చాలని వేధింపులు, బాధితురాలు ఏం చేసిందంటే?
బెంగుళూరు: మసాజ్ చేయించుకొనేందుకు వచ్చిన వ్యాపారి అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాదు లైంగిక వాంఛ తీర్చాలని కోరాడు. తన లైంగిక వాంఛ తీర్చకపోతే కాళ్లు నరికేస్తానని హెచ్చరించాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యాపారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్పా పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే కర్ణాటక రాష్ట్రంలో ఓ వ్యాపారి స్పాకు వెళ్ళి మసాజ్ చేయించుకోకుండానే తన లైంగిక వాంఛ తీర్చాలని కోరాడు.
లైంగిక వాంఛ తీర్చాలని స్పాలో పనిచేసే మహిళ ఉద్యోగిపై వ్యాపారి రామకృష్ణ ఒత్తిడి చేశారు. కానీ, బాధితురాలు వ్యాపారికి నచ్చజెప్పేందుకు తీవ్రంగా ప్రయత్నించింది కానీ, అతడు ఒప్పుకోలేదు.

స్పాలో లైంగిక వాంఛ తీర్చాలని డిమాండ్
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలోని సదాశివనగర్ ప్రాంతానికి చెందిన మసాజ్ సెంటర్‌లో వ్యాపారి రామకృష్ణ మసాజ్ చేయించుకొనేందుకు 11 వేల ప్యాకేజీని తీసుకొన్నాడు. అయితే మసాజ్ చేసుకొనే బదులు రామకృష్ణ అక్కడ పనిచేసే మహిళ ఉద్యోగిని తన లైంగిక వాంఛ తీర్చాలని డిమాండ్ చేశారు. మసాజ్ చేయించుకోవాలని బాధితురాలు ఎంత నచ్చజెప్పినా వినలేదని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాళ్ళు విరగొడుతానని బెదిరింపు
మసాజ్ చేసుకొనేందుకు స్పాకు వచ్చిన వ్యాపారి రామకృష్ణ తన లైంగిక వాంఛను తీర్చాలని స్పా సెంటర్‌లో పనిచేసే మహిళ ఉద్యోగిని డిమాండ్ చేశారు. అయితే అసాంఘిక కార్యక్రమాలకు తావు లేదని ఆ మహిళా ఉద్యోగి అతడికి నచ్చజెప్పింది. అయితే తన లైంగిక వాంఛ తీర్చకపోతే కాళ్ళు విరగడొతానని వ్యాపారి బెదిరించడాని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మహిళా ఉద్యోగికి బెదిరింపు
తనతో లైంగిక వాంఛ తీర్చాలని వ్యాపారి రామకృష్ణ మహిళ ఉద్యోగిని కోరారు.అయితే ఆమె ఒప్పుకోకపోవడంతో స్పా లో వ్యభిచారం జరుగుతోందని రామకృష్ణ బెదిరించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను చెప్పినట్టు వినాలని బెదిరింపులకు దిగాడని ఆమె ఆరోపిస్తున్నారు.

రంగంలోకి పోలీసులు
స్పా సెంటర్ లో పనిచేసే మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రామకృష్ణపై 304, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications