Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

c0c0n 2023:అంతర్జాతీయ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ పై మెగా కాన్ఫరెన్స్

C0C0N అనేది వార్షిక అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ హ్యాకింగ్ కాన్ఫ్‌రెన్స్. ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ పబ్లిక్ -ప్రైవేట్ సహకారంతో కేరళ పోలీసులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రీసెర్జ్ అసోసియేషన్ (ISRA), సొసైటీ ఫర్ ది పోలీసింగ్ ఆఫ్ సైబర్ స్పేస్, యూనిసెఫ్, ఐసీఎంఈసీ, వీ ప్రొటెక్ట్‌తో పాటు ఇతర ఏజెన్సీలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. సమాచారం, సైబర్ మరియు హైటెక్ క్రైమ్స్‌పై చర్చించడం, అవగాహన తీసుకురావడం,అర్థవంతమైన చర్చలు నిర్వహించేందుకు ఈ కార్యక్రమం ఒక చక్కటి వేదికగా నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాలపై చర్చించేందుకు, నేరాలు ఏ విధంగా ఉన్నాయనే అంశంపై చర్చ నిర్వహించడం తద్వారా సమాచారం ఇతరులతో పంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తుంది ఈ వేదిక.

పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో కేరళ పోలీసులు ఎలా సక్సెస్ సాధించారని చెప్పేందుకు సైబర్ డ్రోమ్ (http://www.cyberdome.kerala.gov.in/) ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది. సైబర్ డ్రోమ్ అనేది కేరళ పోలీస్ శాఖకు చెందిన సాంకేతిక పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం.సమర్థవంతమైన పోలిసింగ్ వ్యవస్థ కోసం సైబర్ సెక్యూరిటీ పరంగా అదే సమయంలో సాంకేతికతను జోడించడం జరిగింది. సైబర్ క్రైమ్స్‌ను చేధించేందుకు సైబర్ క్రైమ్ పరిధిలో ఉన్న వివిధ ఏజెన్సీలకు సహకరించేందుకు అత్యద్భుతమైన సాంకేతిక వ్యవస్థతో ఈ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ముందుకొస్తోంది.

 c0c0n 2023:

భారత్‌లో సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ హ్యాకింగ్ అంశాలపై 2022లో నిర్వహించిన అవగాహన కార్యక్రమం లేదా కాన్ఫరెన్స్ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ స్పీకర్లు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోలీసు మరియు భద్రతా దళాల వ్యవస్థల్లో పనిచేసినవారు, ప్రైవేట్ రంగాల్లో పనిచేసినవారు, సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేడు సైబర్ సెక్యూరిటీ డేటా ప్రైవసీల నుంచి ఎదురవుతున్న సవాళ్లపై చర్చించడం జరిగింది. సమాచార భద్రత, సైబర్ సెక్యూరిటీ హైటెక్ నేరాలపై చర్చించి, అవగాహన తీసుకురావడంలో ఈ వేదిక చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాదు భద్రతా దళాలకు, ప్రభుత్వాలకు, పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్స్‌కు, విద్యార్థులకు, ప్రొఫెషనల్స్‌కు కూడా ఉమ్మడి వేదికగా ఉంది.

 c0c0n 2023:International Hacking and Cyber Security Conference

c0c0n XVI - 2023,16వ ఎడిషన్ కాన్ఫరెన్స్ 4 అక్టోబర్ నుంచి 7 అక్టోబర్ వరకు కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో ఉన్న గ్రాండ్ హయత్ హోటల్‌లో జరుగుతుంది.తొలి రెండు రోజుల్లో అంటే అక్టోబర్ 4వతేదీ 5వ తేదీల్లో వర్క్‌షాప్ నిర్వహించడం జరుగుతుందని ఆ తర్వాత రెండు రోజులు 6,7వ తేదీల్లో ప్రధాన కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తామని కేరళ పోలీసు శాఖ పేర్కొంది.ఇక ఈ కాన్ఫరెన్స్ మిషన్‌ "Connect | Collaborate | Contribute"గా అభివర్ణించారు. సైబర్ సెక్యూరిటీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఇందులో భాగస్వాములుగా చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది.

కేరళ విజిలెన్స్ మరియు ఏసీబీ డైరెక్టర్ మనోజ్ అబ్రహాం వన్‌ఇండియాతో మాట్లాడారు. c0c0n@16 కార్యక్రమానికి హాజరయ్యేవారికి ఇదొక చక్కటి అనుభూతిని ఇస్తుందని చెప్పారు.ఈ కాన్ఫరెన్స్‌లో డెమాన్స్‌ట్రేషన్స్ ఉంటాయని చెప్పారు. అంతేకాదు ప్రపంచగతినే మార్చేసిన పలు సాంకేతిక అంశాలపై కూడా చర్చించడం జరుగుతుందని వెల్లడించారు. ఫ్లయింగ్ డెమాన్స్‌ట్రేషన్స్‌లో భాగంగా హాజరయ్యేవారికి జెట్ సూట్‌ ధరింపజేసి యాక్షన్‌లోకి దిగే అవకాశం ఉంటుందని చెప్పారు.

ఇక ఇక్కడ శిక్షణ ఇచ్చేవారు ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవం ఉన్న నిపుణులని మనోజ్ అబ్రహాం తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కచ్చితంగా కొత్త టెక్నాలజీని నేర్చుకున్నామన్న సంతోషంతో వెనుదిరుగుతారని చెప్పారు.ఇక్కడ చాలా నేర్చుకుంటారని ఆయన వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+