కశ్మీర్ అవమానం మర్చిపోం- ఢిల్లీ కుట్రల్ని జనంలోకి తీసుకెళ్తామన్న మెహబూబా ముఫ్తీ
చట్టవిరుద్ధంగా, ప్రజాస్వామ్య విరుద్దంగా ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకున్న నిర్ణయంతో ఎదురైన అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని జమ్మూ, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ నేత మెహబాబూ ముఫ్తీ వ్యాఖ్యానించారు. ప్రజాభద్రతా చట్టం కింద ఏడాది నుంచి గృహనిర్బంధంలో ఉన్న ముఫ్తీ నిన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో విడుదలయ్యారు.
గృహనిర్బంధం నుంచి బయటికొచ్చిన తర్వాత కశ్మీరీలను ఉద్దేశించి మెహబూబా ముఫ్తీ ఎంతో ఉద్వేగంగా స్పందించారు. ఢిల్లీ దర్బార్ మా నుంచి చట్టవిరుద్ధంగా, అప్రజాస్వామిక పద్ధతిలో తీసుకున్నది (ఆర్టికల్ 370) తిరిగి తీసుకోవాలి. ఇది మాత్రమే కాదు, కాశ్మీర్ సమస్యను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది, దీని కోసం అనేక మంది కాశ్మీరీలు తమ ప్రాణాలను వదులుకున్నారు. నాకు తెలుసు మార్గం సులభం కాదు కాని మేము ఈ పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు, నన్ను విడిచిపెట్టినప్పుడు, చట్టవిరుద్ధంగా నిర్బంధంలో ఉన్న ఇతరులను విడుదల చేయాలని నేను కోరుతున్నాను "అని ముఫ్తీ ప్రజలకు తన సందేశంలో పేర్కొన్నారు.

గతేడాది కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ముఫ్తీని ఇతర నేతలతో పాటు నిర్బంధంలో ఉంచిన కేంద్రం.. ఆ తర్వాత దాన్ని పొడిగిస్తూ వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముఫ్తీపై కఠినమైన ప్రజాభద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఆమెను అధికారిక నివాసాన్నే అనుబంధ జైలుగా మార్చి మరీ నిర్బంధంలో ఉంచారు. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆమె విడుదలయ్యారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications