
370,35 ఆర్టికల్స్‌ను నరేంద్రమోడీ తోలగించలేడు... అవి మా హక్కులు..ఫరూక్ అబ్ధుల్లా
జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులను సాధించిపెడుతున్న రాజ్యంగంలోని ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35-a ను ప్రధాని నరేంద్ర మోడీ తొలగించలేరన ఆ రాష్ట్ర్ర నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. కాగ రెండు ఆర్టికల్స్ రాష్ట్ర్ర ప్రజల హక్కులను కాపాడుతున్నాయని అన్నారు. ఇవి మాకు చాల ముఖ్యమని, జమ్ము కశ్మీరీలుగా దేశానికి సైనికుల్లాంటీ వారని వారు దేశానికి శత్రువులు కాదని అన్నారు.

మేము దేశ సైనికులం శత్రువులం కాదు..ఫరూక్
కాగా ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని ప్రజలను విడదీయాడానికి బదులుగా ఐక్యంగా ఉంచడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కోన్నారు. ఇక ప్రధాని మోడీ శక్తివంతుడని బావిస్తున్నాడని ఆయన్ను అలాగే ఉండనిద్దామని ఆయన పేర్కోన్నారు. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో జమ్ముకశ్మీర్‌లో ఉన్న మొత్తం ఆరు స్థానాల్లో బీజేపీ మూడు స్ధానాల్లో విజయం సాధించగా కశ్మీర్ ప్రాంతంలో మరో మూడు స్దానాలను నేషనల్ కాన్ఫరెన్స్ కైవసం చేసుకుంది.

370 తోలగింపుపై బీజేపీ ప్రకటన..
50 సంవత్సరాల పార్లమెంట్ చరిత్ర తిరగారాసిన ప్రధాని నరేంద్రమోడీ మరోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో ఆయన ముందు పలు జాతీయ సవాళ్లు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా కశ్మిర్ సమస్య.కశ్మీర్‌లో ఉగ్రవాదం, తీవ్రవాదం పెట్రేగిపోతున్న నేపథ్యంలో మోడీ ప్రత్యేక శ్రద్ద కనబరిచారు. ఈనేపథ్యంలోనే నేరుగా ప్రకటనలు చేశారు. తాను కశ్మీర్ కు వచ్చిన ప్రతి రెండు మూడు రోజుల తర్వాత అక్కడ మిలిటెట్లను ఏరివేస్తున్నారని ఇది ప్రత్యేకంగా మోడీ తీసుకున్న నిర్ణయమని ఆయన ప్రకటించారు.

భారీ మెజారీటి రావడంతో మోడీపై పెరిగిన నమ్మకం
దీంతో కశ్మీర్ సమస్య పరిష్కారానికి ప్రజలు పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ పక్కనే కశ్మీర్ ఉండడం ఉగ్రవాదులు స్థానికుల సహకారంలో చోరబాటు చేసి వింధ్వంసానికి పాల్పడుతుండడంతో దేశానికి ఇబ్బందులు కల్గుతున్నాయి. దీంతో కశ్మర్ లో కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు ఇస్తున్న 375 ఆర్టికల్ ను తొలగిస్తామని ప్రచారం చేస్తోంది. పెద్ద మెజారీటీ వచ్చిన మోడీ ఎలాంటీ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
మరోవైపు పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సైతం మోడీ గెలిస్తేనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం దోరుకుందని ప్రకటించారు.ఈనేపథ్యంలోనే ఆయన గెలుపు తర్వాత అభినందనలు కూడ తెలిపారు.