Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చైనాలో వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 కల్లోలం: భారత్‌లో మూడు కేసులు

న్యూఢిల్లీ: చైనాలో కరోనావైరస్ మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడానికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్7(BF.7) కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, తాజాగా, ఈ వేరియంట్ కేసులు భారతదేశంలోనూ నమోదు కావడం కలకలం రేపుతోంది.

బీఎఫ్7 వేరియంట్ తొలి కేసును గుజరాత్ బయోటక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అక్టోబర్ నెలలోనే గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఈ వేరియంట్ కేసులు ఇప్పటి వరకు మూడు నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గుజరాత్ రాష్ట్రంలో రెండు కేసులు నమోదు కాగా, మరో కేసు ఒడిశా రాష్ట్రంలో కనుకొన్నట్లు పేర్కొన్నాయి.

Cases Of Covid Variant surge in China: Three BF7 cases Found In India.

అయితే, మనదేశంలో బీఎఫ్7 కొత్త వేరియంట్ వెలుగు చూసినప్పటికీ కేసుల్లో పెరుగుదల గణనీయంగా లేదని నిపుణులు పేర్కొన్నారు. కోవిడ్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఏర్పాటు చేసిన సమావేశంలో నిపుణులు ఈ మేరకు తెలిపారు. వ్యాప్తిలో ఉన్న వేరియంట్లతోపాటు కొత్తగా బయటపడుతున్న వేరియంట్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసరమని సూచించారు. ఈ క్రమంలోనే జీనోమ్ సీక్వెన్సింగ్ పౌ ప్రధానంగా దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

ఏంటీ బీఎఫ్7 వేరియంట్?

ఒమిక్రాన్ బీఏ.5కు చెందిన సబ్ వేరియేంటే ఈ బీఎఫ్.7. వేగంగా వ్యాప్తి చెందే ఈ వేరియంట్ కు బలమైన ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం కూడా ఉంది. దీని ఇంక్యుబేషన్ వ్యవధి కూడా చాలా తక్కువ. అంతేగాక, రీఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం ఈ వేరియంట్ కు ఉండటం గమనార్హం. అందుకే ఈ వేరియంట్ చైనాతోపాటు అమెరికా, కెనడా, బ్రిటన్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ వంటి దేశాల్లో కేసుల పెరుగుదలకు కారణమవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+