జాతీయ రహదారులపై కేంద్రం గుడ్ న్యూస్: ఇకపై రూ. 1.5 లక్షలు

రోడ్డు ప్రమాద బాధితుల అత్యవసర చికిత్సలో ఆర్థిక ఇబ్బందుల వల్ల కలిగే జాప్యాన్ని తొలగించడానికి కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులు ఆసుపత్రిలో చేరిన మొదటి ఏడు రోజులకు 1.5 లక్షల వరకు నగదు రహిత వైద్య చికిత్సకు అర్హులవుతారని వెల్లడించింది. దీనికి సంబంధించిన విధి విధానాలను మంత్రిత్వ శాఖ రూపొందిస్తోంది.

ఇదివరకు కొన్ని ప్రాంతాలలో పైలట్ ప్రాజెక్ట్‌గా దీన్ని అమలు చేశారు. క్రమంగా దీన్ని పూర్తిస్థాయిలో అమలులోకి రానుంది. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరించింది. రోడ్డు ప్రమాద బాధితులు చికిత్సకు అవసరమైన డబ్బు కోసం ఇబ్బందులు పడకుండా, కేంద్రం నేరుగా ఆసుపత్రులకు చెల్లింపులు చేసేందుకు ఈ పథకం వీలు కల్పిస్తుంది.

Cashless Treatment For Road Accident Victims and Ambulance In 10 Mins

ప్రమాదం జరిగిన మొదటి కొన్ని గంటలను గోల్డెన్ అవర్ గా పిలుస్తారు. ఇది బాధితుల ప్రాణాలను కాపాడటంలో చాలా కీలకం. ఈ సమయంలో తక్షణ వైద్య సహాయం అందక పోతే ప్రాణాలు పోవచ్చు. అలా జరక్కుండా చూడటానికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ కార్యక్రమాన్ని రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ప్రతి ఒక్కరికీ ఆసుపత్రిలో చేరిన మొదటి ఏడు రోజులకు 1.5 లక్షల వరకు నగదు రహిత ట్రీట్మెంట్ లభిస్తుంది. దీనిద్వారా ముందస్తు ఖర్చుల కారణంగా చికిత్స ఆలస్యం కాకుండా నివారించవచ్చు.

ప్రమాద స్థలాలకు చేరుకోవడంలో జాప్యాన్ని పరిష్కరించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఓ నూతన వ్యవస్థను రూపొందిస్తోంది. దీని ద్వారా ప్రత్యేక అంబులెన్స్‌లను ఏర్పాటు చేసి, అవి 10 నిమిషాల్లోపు ప్రమాద స్థలానికి చేరుకునేలా చర్యలు తీసుకుంటోంది. ఆధునికీకరించిన అంబులెన్స్ సేవలను కేంద్రీకృత అత్యవసర హెల్ప్‌లైన్‌తో అనుసంధానించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వాలతో ఓ కుదుర్చుకునే అవకాశం ఉంది.

దీని ప్రకారం, ఆధునిక అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకుని రావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. అలాగే ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిన 10 నిమిషాల లోపు సమయాన్ని క్విక్ రియాక్షన్ గా భావిస్తారు. అంబులెన్స్ నిర్దేశిత సమయం లోపు ప్రమాద స్థలానికి చేరుకున్నట్లయితే- దీనికి అయ్యే ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తిరిగి చెల్లిస్తుంది. ఆయా అంబులెన్ అన్నింట్లోనూ ప్రత్యేక రెస్క్యూ కిట్ లను ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+