మా కులం గురించి పట్టించుకోరా ?, ఎవరికో రిజర్వేషన్లు ఇస్తారా, మాజీ సీఎంకు సినిమా, రాళ్ల వర్షం !!

బెంగళూరు/శివమొగ్గ: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకు పెరిగిపోతున్నది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడిన సమయంలో కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం 4 శాతం ముస్లీం రిజర్వేన్లకు మంగళం పాడేసింది. ఇదే సమయంలో ఆ నాలుగు శాతం రిజర్వేషన్లను మరో రెండు కులాలకు కేటాయించడంతో ఇంతకాలం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న మిగిలిన కులాలు మండిపడుతున్నాయి.

మాకు రిజర్వేషన్ల కేటాయించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని బంజార కుల సంఘాల నాయకులు, ఆ కులస్తులు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్న బంజారా కులస్తులు సిట్టింగ్ సీఎం, మంత్రుల ఇళ్ల మీద దాడులు చెయ్యడం మానేసి మాజీ సీఎం ఇంటి మీద దాడులు చెయ్యడం కలకలం రేపింది. ఒక్కసారిగా మాజీ సీఎం ఇంటి మీద దాడులు జరగడంతో పోలీసులతో పాటు మాజీ సీఎం అనుచరులు హడలిపోయారు.

 Caste reservation, Banjara caste leaders attacked former CM BS Yeddyurappas house in Shimoga in Karnataka.

కర్ణాటకలో పలు సంఘాల నాయకులు మాకు రిజర్వేషన్లు కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా బంజారా కులస్తులు, బలిజ కులస్తులు కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం మీద గుర్రుగా ఉన్నారు. మాకు రిజర్వేన్లు కల్పిస్తామని గతంలో మాట ఇచ్చి న మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప చివరికి మాకు మోసం చేశారని బంజారా కులస్తులు మండిపడుతున్నారు.

సోమవారం శివమొగ్గలోని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప ఇంటి సమీపంలోని బంజారా కులస్తులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. ఆ సందర్బంలో పోలీసులు యడియూరప్ప ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే పరిస్థితి ఒక్కసారిగా విషమించడంతో బంజారా కులస్తులు మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప ఇంటి వైపు దూసుకుపోయారు.

ఆ సందర్బంలో బంజారా కులస్తులు బీఎస్. యడియూరప్ప ఇంటి మీద రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో పోలీసులతో పాటు సామాన్య ప్రజలకు గాయాలైనాయి. హడలిపోయిన పోలీసులు అదనపు పొలీసు బలగాలను రంగంలోకి దింపారు. పోలీసుల లాఠీ చార్జ్ లో అనేక మందికి గాయాలైనాయి. గాయాలైన వారిని ఆసుపత్రులకు తరలించారు.

రిజర్వేషన్ల విషయంలో మాకు అన్యాయం జరిగిందనని బంజారా కులస్తులు ఆరోపిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా శివమొగ్గతో పాటు బెంగళూరులోని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప ఇంటి దగ్గర పోలీసులు గట్టిబందో బస్తు ఏర్పాటు చేశారు. గతంలో బలిజ (రాయల్స్)కు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చినా ఇంత వరకు బలిజ కులస్తుల ఆశలు ఫలించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+