Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హార్డ్ గా కాదు స్మార్ట్ గా, తెలివిగా పని చెయ్యాలని చెప్పిన సీబీఐ డైరెక్టర్, పిన్ టూ పిన్ !

బెంగళూరు: సీబీఐ అధికారులు కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకోవాలని సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ సాటి సిబ్బందికి సూచించారు. ఘజియాబాద్‌లోని సీబీఐ అకాడమీలో ప్రసంగించిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ మన విధులను మనం నిర్వర్తిస్తూ న్యాయంగా, చట్టబద్దంగా పని చెయ్యాలని అన్నారు. మన వృత్తికి శ్రమ అవసరం, శ్రమతో పాటు తెలివిగా పని చేసే అలవాటును పెంపొందించుకోవాలని ప్రవీణ్ సూద్ చెప్పారు.

ఆర్థిక లావాదేవీలు, మోసం పథకాలు, చట్ట వ్యతిరేక మోసాల నివారణ, దర్యాప్తుతో సహా వివిద విభాగాల్లో సీబీఐ ఉద్యోగులు ఆరు వారాల కఠినమైన శిక్షణను పొందాలని ప్రవీణ్ సూద్ చెప్పారు. కర్ణాటక పోలీసు డైరెక్టర్ జనరల్‌గా ఉన్న కర్ణాటక క్యాడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ మే 28న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 37 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలంలో వివిధ కీలక పదవుల్లో ప్రవీణ్ సూద్ పనిచేశారు.

 praveensood2-

కర్ణాటక డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రవీణ్ సూద్ మీద ఒక్క ఆరోపణ రాలేదు, సాటి ఐపీఎస్ అధికారులతో పాటు కిందిస్థాయి సిబ్బందితో ఎంతో మంచితనంతో ఉండే ప్రవీణ్ సూద్ వివాదాస్పద నిర్ణయాలు తీసుకోకుండా వాటికి దూరంగా ఉన్నారు. కర్ణాటక డీజీపీగా ప్రవీణ్ సూద్ చక్కటి ప్రతిభ కనపరిచారు.

అయితే బీజేపీకి డీజేపీ ప్రవీణ్ సూద్ అనుకూలంగా ఉన్నారని అప్పట్లో కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం కర్ణాటక డీజేపీగా పని చేస్తున్న ప్రవీణ్ సూద్ ను సీబీఐ డైరెక్టర్ గా నియమించడం హాట్ టాపిక్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొందరు ప్రవీణ్ సూద్ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేసినా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ ఆ విషయంలో నోరు విప్పలేదు. కర్ణాటకలోని ప్రతి రాజకీయ నాయకుడి గురించి ప్రవీణ్ సూద్ కు పిన్ టూ పిన్ తెలుసు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+