ఐసీఐసీఐ సీఈఓ చందాకొచ్చర్ భర్తపై సిబిఐ విచారణ, ఎందుకంటే?

న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌ సంస్థకు బ్యాంకు రుణాలిచ్చినందుకుగాను ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ చందాకొచ్చర్ కుటుంబం లబ్దిపొందిందనే ఆరోపణలపై సిబిఐ విచారణ చేస్తోంది. ఐసిఐసిఐ బ్యాంకు సీఈఓ చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ ఛైర్మెన్ వేణుగోపాల్ ‌థూత్‌లను సీబీఐ అనుమానిస్తోంది. వీడియోకాన్ గ్రూప్ నుండి చందాకొచ్చర్ కుటుంబం ప్రయోజనం పొందిందా లేదా అనే విషయమై విచారణ చేయనున్నారు.

ఐసీఐసీఐ బ్యాంకు వీడియోకాన్ సంస్థకు రూ.3,250 కోట్ల రుణం ఇచ్చింది. అయితే ఈ విషయమై ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ చందా కొచ్చర్ కుటుంబానికి వీడియాకాన్ కంపెనీ నుండి లబ్దిపొందిందనే ఆరోపణలు ఇటీవల వెలుగుచూశాయి. దీనిపై సిబిఐ దర్యాప్తును చేపట్టింది.

CBI registers preliminary enquiry into nexus between Deepak Kochhar and Videocon chief

2012లో వీడియోకాన్ సంస్థ ఐసీఐసీ బ్యాంక్ రుణం ఇచ్చింది.వీడియోకాన్‌కు చెందిన వేణుగోపాల్ ధూత్, చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, మరో ఇద్దరు కలిసి 2008లో ఓ కంపెనీని ఏర్పాటు చేశారు.

వీడియోకాన్‌ సంస్థకు రూ.3,250 కోట్ల రుణ వ్యవహారంలో చందా కొచ్చర్‌ సహాయం చేసినట్లు ఒక మీడియా నివేదిక ఆరోపించింది. 2012లో వీడియోకాన్‌కు ఐసీఐసీఐ బ్యాంక్‌ ఈ రుణం ఇచ్చింది. అయితే ఈ రుణం విషయంలో చందాకొచ్చర్ కుటుంబానికి ప్రయోజనం కలిగిందనే విమర్శలు వస్తున్నాయి. వీడియోకాన్ కంపెనీకి ఐసీఐసీఐ బ్యాంకు నుండి రుణం తీసుకొన్న రుణంలో సుమారు 86 శాతం వీడియోకాన్ చెల్లించలేదు. ఈ వ్యవహరంలోనే కొచ్చర్ కుటుంబానికి ప్రయోజనం ఉందని విమర్శలు రావడంతో సిబిఐ దర్యాప్తు చేస్తోంది.

అయితే ఈ ఆరోపణలను ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు వివరణ కూడ ఇచ్చింది ఈ వార్తలన్నీ అసత్యమని చందాకొచ్చర్ ప్రకటించారు. ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు డైరెక్టర్లు కూడ చందా కొచ్చర్‌కు సపోర్ట్‌గా నిలిచారు. బ్యాంకు రుణ ఆమోదానికి అంతర్గత ప్రక్రియలను సమీక్షించినట్టు బోర్డు ప్రకటించింది. బ్యాంకు అంతర్గత ప్రక్రియలు బలంగా ఉన్నాయని బ్యాంకు ఎక్స్చేంజీలకు సమాచారాన్ని పంపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+