Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CD Scandal: స్టోరీ మొత్తం చెప్పిన సీడీ లేడీ, మేడమ్ కు నిక్ నేమ్, భారీ గిఫ్ట్ లు ?, 300 స్క్రీన్ షాట్స్ !

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జారకిహోళితో రాసలీలలు సాగించిన సీడీ లేడీ విచారణ అధికారుల ముందు అసలు విషయాలు మొత్తం చెప్పేసిందని సమాచారం. ఏ పనికోసం రమేష్ జారకిహోళిని కలిస్తే తరువాత ఏమేమి జరిగింది ?, అసలు కథ ఎక్కడ మొదలైయ్యింది. రాసలీలల సీడీ విడుదల అయ్యే వరకు ఏంత కథ నడించింది అనే పూర్తి సమాచారం సీడీ లేడీ సిట్ అధికారులకు చెప్పిందని తెలిసింది. అంతే కాకుండా మాజీ మంత్రి రమేష్ జారకిహోళి తనను ముద్దుగా ఏమని పిలిచేవాడు ?, తనకు ఎంతెంత విలువైన గిఫ్ట్ లు కొనిచ్చాడు ? అనే సమాచారం ఇచ్చింది. మాజీ మంత్రి రమేష్ జారకిహోళి అశ్లీలంగా తనతో వాట్సాప్ చాటింగ్ చేశాడని ఆ సీడీ లేడీ సుమారు 300 స్క్రీన్ షాట్స్ సిట్ అధికారులకు అందించిందని కన్నడ మీడియా అంటోంది.

 నేను ఎందుకు కలిశానంటే ?

నేను ఎందుకు కలిశానంటే ?

మంత్రి పదవిలో ఉన్న రమేష్ జారకిహోళిని తాను ఎందుకు కలిశానో అనే విషయాన్ని సీడీ లేడీ సిట్ అధికారులకు చెప్పింది. ఓ షార్ట్ ఫిల్మ్ తియ్యడానికి సహాయం చెయ్యాలని మంత్రి పదవిలో ఉన్న రమేష్ జారకిహోళిని తాను కలిశానని, తరువాత అప్పటి నుంచి రమేష్ జారకిహోళి తనతో చాలా చనువుగా ఉండటానికి ప్రయత్నించారని సీడీ లేడీ సిట్ అధికారులకు సమాచారం ఇచ్చిందని తెలిసింది.

 షార్ట్ ఫిల్మ్ తో ఏం వస్తుంది.... ప్రభుత్వ ఉద్యోగం గ్యారెంటి

షార్ట్ ఫిల్మ్ తో ఏం వస్తుంది.... ప్రభుత్వ ఉద్యోగం గ్యారెంటి

షార్ట్ ఫిల్మ్ తీస్తే నీకు ఏమీరాదని, నీకు మంచి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని రమేష్ జారకిహోళి తనకు చెప్పాడని. మంచి ఉద్యోగం వస్తే జీవితంలో సెటిల్ అవ్వడానినికి అవకాశం ఉంటుందని తాను ఆశపడి ఆయన్ను అప్పటి నుంచి ఎప్పుడంటే అప్పుడు కలిశానని, ఇద్దరి మద్య చనువు ఎర్పడిందని సీడీ లేడీ సిట్ అధికారులకు చెప్పిందని విశ్వసనీయ సమాచారం.

 ఆ దెబ్బతో అసలు సినిమా

ఆ దెబ్బతో అసలు సినిమా

మంత్రి పదవితో పాటు ప్రభుత్వంలో మంచి పలుకుబడి ఉన్న రమేష్ జారకిహోళి మాటలు నమ్మిన తాను అప్పటి నుంచి ఆయన పిలిచినచోటకు వెళ్లానని, తనను లైంగికంగా లొంగదీసుకున్న రమేష్ జారకిహోళి చివరికి రాసలీలల సీడీ తీసేవరకు వెళ్లిందని, తరువాత రమేష్ జారకిహోళి తనను మోసం చేసి నిలువునా ముంచేశాడని సీడీ లేడీ సిట్ అధికారులకు చెప్పిందని సమాచారం.

 300 వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్

300 వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్

అప్పుడప్పుడు తనకు రమేష్ జారకిహోళి ఫోన్ చేసేవాడని, వాట్సాప్ వీడియో కాల్స్ చేశాడని, ఆ సందర్బంలో అశ్లీలంగా తనతో మాట్లాడుతూ ఆయన కాలం గడిపాడని సీడీ లేడీ సిట్ అధికారులకు చెప్పిందని తెలిసింది. అంతే కాకుండా రమేష్ జారకిహోళి తనతో వాట్సాప్ లో చాటింగ్ చేసిన 300 స్క్రీన్ షాట్స్ కూడా సీడీ లేడీ సిట్ అధికారులకు అందించిందని వెలుగు చూసింది.

 సార్ సూపర్... మేడమ్ కు ముద్దుపేరు ఏమిటంటే ?

సార్ సూపర్... మేడమ్ కు ముద్దుపేరు ఏమిటంటే ?

మాజీ మంత్రి రమేష్ జారకిహోళి సీడీలేడీకి ఓ ముద్దుపేరు పెట్టారని తెలిసింది. మాజీ మంత్రి సీడీ లేడీని 'బేబి' అని పిలిచేవాడని తెలిసింది. ఉదయం నిద్రలేవగానే గుడ్ మార్నింగ్, రాత్రి పడుకునే ముందు గుడ్ నైట్ అంటూ మాజీ మంత్రి రమేష్ జారకిహోళి తనకు వాట్సాప్ మెసేజ్ లు పంపించేశాడని ఆ సీడీ లేడీ సిట్ అధికారులకు చెప్పిందని తెలిసింది.

 భారీగా బంగారు నగలు, మొబైల్ ఫోన్ గిఫ్ట్ ?

భారీగా బంగారు నగలు, మొబైల్ ఫోన్ గిఫ్ట్ ?

అంతేకాకుండా మాజీ మంత్రి రమేష్ జారకిహొళి సీడీ లేడీకి అనేకసార్లు బంగారు నగలు, విలువైన మొబైల్ ఫోన్ తోపాటు ఖరీదైన గిఫ్ట్ లు తీసిచ్చాడని సిట్ అధికారుల విచారణలో వెలుగు చూసిందని సమాచారం. మొత్తం మీద రమేష్ జారకిహోళి, తన మద్య వాట్సాప్ మెసేజ్ లు చాలానే జరిగాయని ఆరోపిస్తూ సీడీ లేడీ 300ల స్క్రీన్ షాట్స్ సిట్ అధికారులకు ఇచ్చిందని ప్రముఖ కన్నడ టీవీ చానల్ వార్తలు ప్రసారం చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+