విదేశీ విరాళాలు తీసుకునే ఎన్జీవోలకు కేంద్రం ఊరట-FCRA రిజిస్ట్రేషన్ కు మార్చి వరకూ గడువు
దేశవ్యాప్తంగా విదేశీ విరాళాలు తీసుకుంటున్న స్వచ్చంధ సంస్ధలపై కేంద్రం వరుసగా దాడులు నిర్వహిస్తోంది. వీరికి అందుతున్న విరాళాలు జాతి వ్యతిరేక కార్యకలాపాలకు అందుతున్నాయన్న అనుమానంతో వీరిపై చర్యలకు దిగుతోంది. ఈ వ్యవహారం కాస్తా రాజకీయ రంగు పులుముకుటోంది. దీంతో కేంద్రం దీనిపై పునరాలోచనలో పడింది. అయితే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద స్వచ్చంధ సంస్ధల రిజిస్ట్రేషన్ మాత్రం తప్పనిసరని చెబుతోంది.
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద స్వచ్చంధ సంస్ధల రిజిస్ట్రేషన్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 31తో ముగుస్తున్న ఈ గడువును మార్చి చివరి వరకూ పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఇవాళ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, FCRA రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల చెల్లుబాటును మార్చి 31, 2022 వరకు లేదా పునరుద్ధరణ దరఖాస్తును పరిష్కరించే తేదీ వరకు, ఏది ముందుగా ఉంటే అది పొడిగించాలని నిర్ణయించిందని కేంద్ర హోంశాఖ ఇవాళ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

డిసెంబరు 25న మదర్ థెరిసా స్థాపించిన ఎన్జీవో మిషనరీస్ ఆఫ్ ఛారిటీ పునరుద్ధరణ దరఖాస్తును ఆమోదించడానికి హోంశాఖ నిరాకరించిన కొన్ని రోజుల తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని ప్రతికూల ఇన్‌పుట్‌ల ఆధారంగా మిషనరీస్ ఆఫ్ ఛారిటీ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణను తిరస్కరించినట్లు హోంశాఖ తెలిపింది. ఎన్జీవోయొక్క రిజిస్ట్రేషన్ అక్టోబర్ 31తో ముగిసింది . దీంతో ఛారిటీ తమ సంస్ధ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసింది. అయితే హోంశాఖ మాత్రం దాన్ని తిరస్కరిస్తూ విదేశాల నుంచి బ్యాంకింగ్ లావాదేవీలు జరపొద్దని ఆదేశాలు ఇచ్చింది.
హోంశాఖ ఇవాళ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం విదేశీ విరాళాల నియంత్రణ చట్ట నిబంధనలు 2011లోని రూల్ 12 ప్రకారం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ గడువు ముగిసేలోపు సంస్థలు FCRA పోర్టల్‌లో పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అన్ని FCRA నమోదిత సంఘాలు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ యొక్క పునరుద్ధరణ కోసం దరఖాస్తును తిరస్కరించిన సందర్భంలో, సర్టిఫికేట్ యొక్క చెల్లుబాటు తిరస్కరణ తేదీతో గడువు ముగిసినట్లు భావించబడుతుందని గుర్తుంచుకోవాలని ఇందులో సూచించారు.
-
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications