వేగంగా వ్యాపిస్తున్న కరోనా - కేంద్రం అలర్ట్..!?

మరోసారి కరోనా వేగంగా వ్యాపిస్తోంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కేసులతో కేంద్రం అలర్ట్ అయింది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కీలక మార్గదర్శకాలను సూచించింది. రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ చేయాలని నిర్దేశించింది. కరోనా XBB.1.16 వేరియంట్ కారణంగా ఈ సంఖ్యలు ఆకస్మికంగా పెరిగుతున్నట్లు గుర్తించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయి. అవసరమైన చర్యల దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది.

దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ 28న అత్యధికంగా 2,208 కేసులు నమోదయ్యాయి. తిరిగి 149 రోజుల తరువాత 1,890 కేసులు రిజిస్టర్ అయ్యాయి. దీని ద్వారా యాక్టివ్ కేసుల సంఖ్య 9,433కి చేరింది. తెలంగాణలో 149 యాక్టివ్ కేసులు ఉండగా, హైదరాబాద్ లో 20 కేసులు గుర్తించారు. ఇదే సమయంలో కేంద్ర ఆరోగ్య‌శాఖ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితుల‌ను స‌మీక్షిస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కీల‌క సూచ‌న‌లు చేస్తోంది. తాజాగా మ‌రికొన్ని సూచ‌న‌లు చేసింది. టెస్టుల సంఖ్య పెంచాల‌ని సూచించింది.

Central Govt Asks states to foucs on optimal testing amid spike in Coivd cases,1,890 new cases

కరోనాను ఎదుర్కోవడానికి సంసిద్ధతను తనిఖీ చేయడానికి వచ్చే నెలలో అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ధేశించి. గత వారం ప్రధాని మోదీ కోరనా వ్యాప్తి పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా ముగిసిపోలేదని..అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చేసిన సూచ‌న‌ల‌ను పాటించాల‌ని రాష్ట్రాల‌ను కేంద్రం కోరింది. క‌రోనా హాట్ స్పాట్ ల‌ను అత్యంత వేగంగా గుర్తించాల‌ని కోరింది. ఆయా ప్రాంతాల్లో మ‌రింత వ్యాప్తి జ‌ర‌గ‌కుండా చూడాల‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ రాష్ట్రాల‌కు మార్గదర్శనం చేసింది.

రేపు కేంద్రం మార్చి 27న కేంద్ర ఆరోగ్య‌శాఖ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించ‌నుంది. క‌రోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్రాలు ఏ విధంగా ముందుకు వెళుతున్నాయ‌నే విష‌యంపై చ‌ర్చించ‌నుంది. అదే విధంగా ఏప్రిల్ 10, ఏప్రిల్ 11వ తేదీల్లో క‌రోనాపై కేంద్రం మాక్ డ్రిల్ నిర్వ‌హించ‌నుంది. ఈ మాక్ డ్రిల్ ద్వారా దేశంలోని ఆసుప‌త్రుల స‌న్న‌ద్ధ‌త‌ను ప‌రీక్షించ‌నుంది. వేగంగా ఇన్ఫెక్షన్లు పెరుగుతండటంతో సాధారణ ప్రజల్లనూ అవగాహన పెంచే కార్యక్రమాల పైన ప్రభుత్వాలు ఫోకస్ చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+