ఐదేళ్లు సీఎం కుర్చీ బీజేపీకే.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
ముంబై : మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో శివసేన మొండి పట్టు పడుతుంటే.. బీజేపీ మాత్రం పట్టాభిషేకానికి రెడీ అవుతోంది. ఆ క్రమంలో బుధవారం నాడే బీజేపీ అసెంబ్లీ శాసనసభా పక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఎన్నుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. శివసేన ఎమ్మెల్యేలు గురువారం నాడు భేటీ అయి ఎల్పీ లీడర్‌ను ఎన్నుకునే ఛాన్స్ కనిపిస్తోంది. అదలావుంటే కేంద్రమంత్రి, ఆర్పీఐ నేత రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి.
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామి కానున్న శివసేన.. అధికారం చెరో సగమంటూ పట్టుబడుతోంది. ఎన్నికల పొత్తులకు ముందే 50-50 ఫార్ములా ఓకే అయిందని వాదిస్తోంది. కానీ బీజేపీ మాత్రం ససేమిరా అంటోంది. సీఎం కుర్చీలో భాగం ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఆ మేరకు ఇరు పార్టీల మధ్య కాసింత ప్రతిష్ఠంభన కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

మహారాష్ట్రకు ఐదేళ్ల పాటు పనిచేసే ముఖ్యమంత్రి కావాలని.. ఆ క్రమంలో సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌కే తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు రాందాస్ అథవాలే. బీజేపీ - శివసేన కూటమికి స్పష్టమైన మెజార్టీ వచ్చినప్పటికీ.. ముఖ్యమంత్రిగా మాత్రం ఫడ్నవీస్ ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఆ క్రమంలో ఆయనకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications