గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన భారత ప్రభుత్వం: ఇతడెవరంటే?

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలో ఆశ్రయం పొందుతున్న గ్యాంగ్‌స్టర్ సతీందర్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ (Goldy Brar)ను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మేరకు అతడ్ని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేరుస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం కెనడాలో ఉంటున్న గోల్డీ బ్రార్‌కు నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌తో సంబంధాలున్నాయని పేర్కొంది. చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA-ఉపా), 1967 ప్రకారం గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్లు హోంశాఖ వెల్లడించింది. గోల్డీ బ్రార్‌కు సీమాంతర ఉగ్రవాద సంస్థలతోపాటు పలు హత్యలతో సంబంధం ఉన్నట్లు కేంద్రం తెలిపింది. గోల్డీ బ్రార్ అతివాద భావజాలాన్ని వ్యాపింప చేయడంతోపాటు పలువురు జాతీయవాద అనుకూల నాయకులకు బెదిరింపు ఫోన్ కాల్స్ చేసినట్లు పేర్కొంది.

Centre declares gangster Goldy Brar as a terrorist under UAPA

దేశంలోని పలువురు ప్రముఖులను హత్య చేసేందుకు కొన్ని హంతక ముఠాలకు డ్రోన్ల ద్వారా అక్రమంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను రవాణా చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. తన అనుచరులతో పంజాబ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించాలని గోల్డీ బ్రార్ ప్రయత్నిస్తున్నట్లు కేంద్రం భావిస్తోంది. ఇతడిపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

కాగా, సతీందర్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్.. పంజాబ్ రాష్ట్రంలోని శ్రీ ముక్తార్ సాహిబ్‌లో 1994లో జన్మించాడు. ఇతడి తండ్రి పోలీస్ ఇన్‌స్పెక్టర్. తొలిసారిగా ప్రముఖ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసు దర్యాప్తులో గోల్డీ బ్రార్ పేరు వెలుగులోకి వచ్చింది. మూసేవాలా హత్య కేసులో అరెస్టైన లారెన్స్ బిష్ణోయ్‌తో ఇతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ హత్య గురించి గోల్డీ బ్రార్ కు ముందే తెలుసని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతోపాటు పలువురికి బెదిరింపు ఫోన్ కాల్స్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు గోల్డీ బ్రార్ పై కేసులు నమోదయ్యాయి. అంతేగాక, కొన్ని హత్య కేసుల్లోనూ గోల్డీ బ్రార్ ప్రధాన నిందితుడిగా ఉండటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+