కరోనా కట్టడికి 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర బృందాలు .. ఎక్కడెక్కడ అంటే

భారతదేశంలో కరోనావైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడి కోసం మంగళవారం 15 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఉన్నతస్థాయి కేంద్ర బృందాలను పంపించాలని నిర్ణయం తీసుకుంది. 50కి పైగా జిల్లాలు,మునిసిపాలిటీలలో ఈ బృందాలు రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయంగా వారికి ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను ఇస్తూ పనిచేస్తాయి.

దేశవ్యాప్తంగా కరోనాకేసుల ఉధృతి తగ్గకపోవడంతోనే కేంద్రం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశ వ్యాప్తంగా తాజా పరిస్థితులను సమీక్షించి అత్యున్నత కేంద్ర బృందాలను పంపాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా 15 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ బృందాలు పర్యటించనున్నారు. ఇక దేశంలోనే కరోనాకేసులలో అత్యంత ప్రభావితం రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్రలో ఏడు జిల్లాలలోనూ,ప్రభావం ఎక్కువగా ఉన్న మునిసిపాలిటీలలోనూ కేంద్ర బృందాలు రంగంలోకి దిగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలు,తమిళనాడు రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో అత్యున్నత కేంద్ర బృందాలు , రాష్ట్ర బృందాలకు గైడెన్స్ ఇవ్వనున్నాయి.

Centre deployed high-level teams to 15 states and Union Territories to control corona

ఇక అంతే కాకుండా రాజస్థాన్ లోని 5 జిల్లాలు, అస్సాంలోని ఆరు జిల్లాలు, హర్యానాలో నాలుగు జిల్లాలు, గుజరాత్ లో మూడు జిల్లాలు,కర్ణాటకలో నాలుగు జిల్లాలు, ఉత్తరాఖండ్ లో మూడు జిల్లాలలో కూడా కేంద్ర బృందాలు కరోనా కట్టడికి యాక్షన్ ప్లాన్ ను రూపొందించనున్నారు. ఇక మధ్యప్రదేశ్లో ఐదు జిల్లాలు,పశ్చిమ బెంగాల్ లో మూడు జిల్లాలు, ఢిల్లీలో మూడు జిల్లాలు,యూపీలో నాలుగు జిల్లాలు, బీహార్లో నాలుగు జిల్లాలు, ఒడిశాలో ఐదు జిల్లాలకు కూడా కేంద్ర బృందాలు వెళ్లనున్నాయి .ఇక ఈ కేంద్ర బృందాలు కరోనా కట్టడికి తగిన వ్యూహాలను, ప్రణాళికలను సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా ఉంటాయి.

Recommended Video

    Surya's Next Future Movie After Seventh Sense Virus, Bandobast Locusts

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+