H3N2 virus : కొత్త వైరస్ మరణాలతో కేంద్రం అప్రమత్తం- పర్యవేక్షణకు కీలక నిర్ణయం..
దేశంలో తాజాగా విజృంభిస్తున్న హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి ఇప్పుడు మరణాలకూ కారణమవుతోంది.దీంతో జనంలో ఆందోళన పెరుగుతోంది.
దేశంలో కొత్త వైరస్ హెచ్3ఎన్2 కేసులు పెరుగుతున్నాయి. ఈ వైరస్ కారణంగా జనం ఎక్కువగా ఆస్పత్రుల పాలుకాకపోయినప్పటికీ భారీగా జ్వరాల బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సమయంలోనే ఇవాళ కర్నాటక, హర్యానాలో ఒక్కో మరణం చోటు చేసుకోవడంతో కేంద్రం అప్రమత్తమైంది.
దేశంలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుఎంజా వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. రియల్ టైమ్ ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) నెట్‌వర్క్ ద్వారా దీన్ని పర్యవేక్షించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వ్యక్తుల వంటి హాని కలిగించే సమూహాలలో అనారోగ్యం, మరణాలపై నిశితంగా గమనిస్తూ చర్యలు తీసుకునేందుకు ఈ నెట్ వర్క్ ఏర్పాటుచేసింది. ఇప్పటి వరకు కర్ణాటక, హర్యానాలలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుఎంజాతో ఒక్కొక్కరు మరణించినట్లు కేంద్రం నిర్ధారించింది.

సీజనల్ ఇన్ ఫ్లూయెంజా వైరస్ వల్ల కలిగే తీవ్రమైన శ్వాసకోశ సంక్రమణగా దీన్ని భావిస్తున్నారు. ఇది ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో వ్యాపిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. భారత్ లో జనవరి-మార్చి మధ్య ఓ వేవ్ గానూ, రుతుపవనాల తర్వాత మరో వేవ్ గానూ ఇది కనిపిస్తుంటుంది. మార్చి తర్వాత నుంచి ఈ కేసులు తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే ప్రస్తుత సవాల్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రకటించింది.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications