Chandrayaan-3 : చంద్రుడికి మరింత దగ్గరగా-70 కిలోమీటర్ల దూరంలో ఫొటోలివే-లైవ్ అప్పటినుంచే..!

చంద్రుడిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే భూమి కక్ష్య నుంచి చంద్రుడి కక్షలోకి వెళ్లిన చంద్రయాన్ -3 తన వ్యాసాన్ని తగ్గించుకుంటూ వచ్చి ఇప్పుడు కేవలం 70 కిలోమీటర్ల దూరంలో నిలిచింది. అయితే చంద్రుడిపై ప్రస్తుతం చేస్తున్న ప్రయాణ వేగం తక్కువగా ఉండటంతో ఇది రేపటి కల్లా చంద్రుడిపైకి సురక్షితంగా ల్యాండ్ కాబోతోంది.

చంద్రయాన్ ల్యాండర్ లో ఇస్రో పెట్టిన కెమెరా ఇప్పుడు 70 కిలోమీటర్ల దూరం నుంచి చంద్రుడి ఫొటోలు తీసి పంపింది. దీంతో చంద్రుడి దక్షిణ ధృవం ఎలా ఉందో ప్రపంచానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఇవాళ ఎప్పటికప్పుడు చంద్రయాన్-3 మిషన్ అప్ డేట్స్ ఇస్తున్న ఇస్రో.. ఈ ఫొటోల్ని కూడా విడుదల చేసింది. వీటిని చూస్తే వాస్తవంగా చంద్రుడి ఉపరితలం ఎలా ఉందో చాలా స్పష్టంగా అర్ధమవుతోంది. మట్టిలో వర్షపు చుక్కలు పడితే ఎలా ఉంటుందో అలా ఉన్న చంద్రుడి ఉపరితలం ఇందులో కనిపిస్తోంది.

Chandrayaan-3 : isro shares moon pics from 70km distance, isro live from 5.20pm tomorrow

చంద్రయాన్-3 మిషన్ కు సంబంధించి ఇస్రో షేర్ చేసిన అప్ డేట్ ప్రకారం.. మిషన్ ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారం పయనిస్తోంది. సిస్టమ్‌లతో సాధారణ తనిఖీలు కొనసాగుతున్నాయి. స్మూత్ సెయిలింగ్ కొనసాగుతున్నట్లు తెలిపింది.మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ (MOX) శక్తి & ఉత్సాహంతో సందడి చేస్తోందని వెల్లడించింది. అలాగే చంద్రయాన్ విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై ల్యాండింగ్ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారం రేపు సాయంత్రం 5.20 నిమిషాలకు ప్రారంభిస్తామని కూడా తెలిపింది.

ఆగస్ట్ 19న అంటే మూడు రోజుల క్రితం దాదాపు 70 కి.మీ ఎత్తు నుండి ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా (LPDC) ద్వారా తీసిన చంద్రుని చిత్రాల్ని ఇస్రో షేర్ చేసింది. ఈ చిత్రాలు ల్యాండర్ మాడ్యూల్‌ను ఆన్‌బోర్డ్ మూన్ రిఫరెన్స్ మ్యాప్‌తో సరిపోల్చడం ద్వారా దాని స్థానాన్ని (అక్షాంశం, రేఖాంశం) నిర్ణయించడంలో సహాయపడతాయని ఇస్రో చెబుతోంది. వీటి ఆధారంగా చంద్రయాన్ మిషన్ ఎలా సాగుతోందన్న ఉత్కంఠను జనంలో మరింతగా పెంచేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+