Lady SI: పోలీస్ లవ్ స్టోరీ, నా కథలో విలన్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ ఆ ఎస్ఐ, మైండ్ బ్లాక్ !
బెంగళూరు/ మైసూరు: ఒకే సిటీలో పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్స్ (SI)లుగా పని చేస్తున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరూ పోలీస్ శాఖలో ఎస్ఐలు కావడంతో వారి సినిమాలు, షికార్లు, విలాసాలకు ఎవ్వరు అడ్డుపడలేదు. కరోనా వైరస్ లాక్ డౌన్ కాలంలో కూడా పోలీస్ లవ్ స్టోరీ భలే గమ్మత్తుగా సాగిపోయింది. పెళ్లి చేసుకుంటాడని నమ్మకంతో లేడీ ఎస్ఐ సాటి ఎస్ఐకి సర్వం సమర్పించుకుంది. ఇదే సమయంలో పెళ్లి తరువాత చేసుకుందాం అంటూ ప్రియురాలికి ఆ ఎస్ఐ అబార్షన్ చేయించాడని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే సర్వీస్ రివాల్వర్ తో కాల్చిపారేస్తా అంటూ ఎస్ఐ ఎదురుతిరిగాడని లేడీ ఎస్ఐ కేసు పెట్టడం కలకలం రేపింది. నా లవ్ స్టోరీలో విలన్ తో పాటు స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ తన ప్రియుడు ఎస్ఐ అంటూ ఆ లేడీ ఎస్ఐ ఇప్పుడు సాటి పోలీసు అధికారులను ఆశ్రయించడంతో అందరూ షాక్ అయ్యారు. లేడీ ఎస్ఐ లవ్ స్టోరీ విన్న వారి మైండ్ బ్లాక్ అయ్యింది.

మైసూరులో ఇద్దరూ ఎస్ఐలు
కర్ణాటకలోని మైసూరు సిటీలోని ఎన్ఆర్ పోలీస్ స్టేషన్ లో ఆనంద్ ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నాడు. మైసూరులోని వీవీ పురం పోలీస్ స్టేషన్ లో లేడీ సబ్ ఇన్స్ పెక్టర్ గా రాధా అనే యువతి ఉద్యోగం చేస్తున్నారు. మైసూరు నగరంలోనే ఎస్ఐలుగా పని చేస్తున్న ఆనంద్, రాధాలకు పరిచయం అయ్యింది. ఒకే శాఖలో ఉద్యోగాలు చెయ్యడంతో ఆనంద్, రాధాల పరిచయం కాస్తా రానురాను పెరిగింది.

ఐలవ్ యూ రాధా... రాధా... రాధా
ఆనంద్, రాధాలు చాలా దగ్గర అయ్యారు. ఇద్దరి కుటుంబాల గురించి ఒకరికొకరు చెప్పుకున్నారు. ఇదే సమయంలో ఎస్ఐ ఆనంద్ సాటి లేడీ ఎస్ఐ రాధాకు సూటిగా ఐలవ్ యూ చెప్పాడని తెలిసింది. ఇద్దరూ ఒకేశాఖలో ఉద్యోగాలు చేస్తున్నందున పెళ్లికి ఎలాంటి ఆటంకాలు ఉండవని భావించిన లేడీ ఎస్ఐ రాధా ఆనంద్ తో లవ్ లో పడిందని తెలిసింది.

మైసూర్ స్యాండిల్ సోప్ అనుకుంటే రిన్ సోప్ ?
అందరి ప్రేమికుల్లాగే ఎస్ఐలు ఆనంద్, రాధా సినిమాలు, షికార్లు, పార్క్ లు, కేఆర్ ఎస్ డ్యామ్ తదితర ప్రాంతాల్లో తిరుగుతూ లైఫ్ ఎంజాయ్ చేశారు. ఇటీవల పెళ్లి చేసుకుందామని లేడీ ఎస్ఐ రాధా సాటి ఎస్ఐ ఆనంద్ మీద ఒత్తిడి చేశారని తెలిసింది. కరోనా వైరస్, లాక్ డౌన్ డ్యూటీ అంటూ ఎస్ఐ ఆనంద్ కొంతకాలం పెళ్లి వాయిదా వేద్దామని కాలం గడిపేశాడని ఆరోపణలు ఉన్నాయి.

పోలీసు అధికారులు షాక్
మైసూరు సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లిన లేడీ ఎస్ఐ రాధా సాటి ఎస్ఐ ఆనంద్ మీద కేసు పెట్టారు. అమ్మా ఏం జరిగింది ? అంటూ పై పోలీసు అధికారులు రాధాను ఆరా తీశారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి నా జీవితాన్ని నిలువునా ముంచేసిన ఎన్ఆర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆనంద్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని లేడీ ఎస్ఐ రాధా బోరుమని విలపించడంతో పోలీసు అధికారులు షాక్ అయ్యారు.

అబార్షన్ చేయించిన ఎస్ఐ ?
తనను పెళ్లి చేసుకుంటానని సినిమాలు, షికార్లు, పార్క్ లు, రిసార్టులకు తిరిగి తనను ఎస్ఐ ఆనంద్ శారీరకంగా లొంగదీసుకున్నాడని, తాను గర్బవతిని అయిన తరువాత పెళ్లి తరువాత చేసుకుందామని చెప్పి అబార్షన్ చేయించాడని, ఇప్పుడు పెళ్లి చేసుకోనని ఎదురు తిరుగుతున్నాడని లేడీ ఎస్ఐ రాధా పై అధికారులకు చెప్పడంతో అందరూ హడలిపోయారు.

నా లవ్ స్టోరీలో విలన్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఆనందే
తాను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశానని, పెళ్లి పేరు ఎత్తితే నిన్ను చంపేస్తాను జాగ్రత్త, కేసు కూడా ఉండదు అంటూ ఎస్ఐ ఆనంద్ బెదిరిస్తున్నాడని సాటి లేడీ ఎస్ఐ రాధా సంచలన ఆరోపణలు చెయ్యడంతో పోలీసు అధికారుల దిమ్మతిరిగిపోయిందని సమాచారం. ఇద్దరూ పోలీసు శాఖలో ఎస్ఐలు కావడం, ఈ విషయం మీడియాకు తెలిసిపోవడంతో పోలీసు అధికారులు తలలు పట్టుకున్నారు.

ఇప్పట్లో తేలుతుందా స్వామి !
పోలీసు శాఖకు చెందిన ఇద్దరు ఎస్ఐలకు పై అధికారులు నిజంగా పెళ్లి చేస్తారా ?, లేదా లేడీ ఎస్ఐ రాధా ఫిర్యాదు మేరకు లవ్ స్టోరీని కొత్త మలుపు తిప్పుతారా ? అనే విషయం ఇప్పట్లో తేలేటట్లు లేదని తెలిసింది. ఎవరైనా ప్రేమికులు మాకు న్యాయం చెయ్యాలని పోలీసులను ఆశ్రయిస్తుంటారు. అయితే ఇక్కడ ఓ లేడీ ఎస్ఐ ఆమె లవ్ స్టోరీలో న్యాయం చెయ్యాలని సాటి పోలీసులను ఆశ్రయించడంతో సామాన్య ప్రజలు షాక్ అయ్యారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications