Cheating: పెళ్లికి గంట ముందు చేతులు ఎత్తేసిన ప్రియురాలు, పుణ్యక్షేత్రంలో గర్ల్ ఫ్రెండ్ దెబ్బకు ? !
బెంగళూరు/ధర్మస్థలం: ఐటీ హబ్ లో నివాసం ఉంటున్న యువతి, యువకుడికి పరిచయం ఉంది. ఇద్దరూ ఒకేచోట ఉద్యోగం చేస్తుండటంతో చనువు పెంచుకున్నారు. యువతి యువకుడు ప్రేమలోపడ్డారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ప్రేమికులు వివాహారయాత్రలకు వెళ్లి వచ్చారు. ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటామని అనుకున్న ప్రేమికులు శారీరకంగా కలుస్తున్నారని తెలిసింది. పెళ్లికి పెద్దలు అంగీకరించరని, రహస్యంగా పెళ్లి చేసుకుని తరువాత పెద్దలకు మ్యాటర్ చెబుదామని ప్రేమికులు అనుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రంలో పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు నిర్ణయించారు. ప్రియుడి స్నేహితులు పెళ్లికి ఏర్పాట్లు చేశారు.
పుణ్యక్షేత్రానికి చేరుకున్న ప్రేమికులు పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యారు. పెళ్లి ముహుర్తం గంట ముందు ప్రియురాలు నేను పెళ్లి చేసుకోను అని రివర్స్ అయ్యింది. ప్రియురాలిని పెళ్లికి ఒప్పించాలని ప్రియుడు అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే ప్రియురాలు మాత్రం నేను నిన్ను పెళ్లి చేసుకోను అని తేల్చి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రియురాలు మోసం చేసిందని ఆవేదనతో ఇంటికి చేరుకున్న ప్రియుడు డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు, అతని స్నేహితులు షాక్ అయ్యారు.

ఐటీ హబ్ లో ప్రేమికులు
బెంగళూరు నగరంలోని చాముండేశ్వరి లేఔట్ లో చరణ్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బెంగళూరులోనే నివాసం ఉంటున్న సరిత (పేరు మార్చడం జరిగింది) అనే యువతికి, చరణ్ కు పరిచయం అయ్యింది. చరణ్, సరిత ఒకేచోట ఉద్యోగం చేస్తుండటంతో ఇద్దరి మద్య చనువు పెరిగింది. మూడు సంవత్సరాల క్రితం చరణ్, సరిత ప్రేమలోపడ్డారు.

పెళ్లికి ముందు విహారయాత్రలు.... సీక్రేట్ పెళ్లికి స్కెచ్
పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ప్రేమికులు చరణ్, సరిత వివాహారయాత్రలకు వెళ్లి వచ్చారు. ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటామని అనుకున్న ప్రేమికులు సరిత, చరణ్ శారీరకంగా కలుస్తున్నారని తెలిసింది. పెళ్లికి పెద్దలు అంగీకరించరని, రహస్యంగా పెళ్లి చేసుకుని తరువాత పెద్దలకు మ్యాటర్ చెబుదామని చరణ్, సరిత స్కెచ్ వేశారు.

ధర్మస్థలంలో పెళ్లికి ఏర్పాట్లు
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంల్లో ఒక్కటైన ధర్మస్థలంలో పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు చరణ్, సరిత నిర్ణయించారు. ప్రియుడు చరణ్ స్నేహితులు ముందుగానే ధర్మస్థలం చేరుకుని పెళ్లికి ఏర్పాట్లు చేశారు. బెంగళూరు నుంచి ఒకేసారి బయలుదేరిన చరణ్, సరిత ధర్మస్థలం చేరుకున్నారు. ఇక నా పెళ్లి జరిగిపోతుంది అని చరణ్ సంబరపడిపోయాడు.

చేతులు ఎత్తేసిన ప్రియురాలు
పెళ్లి ముహుర్తం గంట ముందు ప్రియురాలు సరిత నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చరణ్ తో గొడవ పెట్టుకుంది. ప్రియురాలు సరిత ఒక్కసారిగా రివర్స్ కావడంతో చరణ్ బిత్తరపోయాడు. ప్రియురాలు సరితను పెళ్లికి ఒప్పించాలని ప్రియుడు చరణ్, అతని స్నేహితులు అక్కడే అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే ప్రియురాలు సరిత మాత్రం నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చరణ్ కు తేల్చి చెప్పింది.

ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు
ప్రియుడు చరణ్ కు హ్యాండ్ ఇచ్చిన సరిత ధర్మస్థలం నుంచి బెంగళూరుకు వెళ్లిపోయింది. ప్రియురాలు సరిత మోసం చేసిందని ఆవేదనతో బెంగళూరులోని చాముండేశ్వరి లేఔట్ లోని సొంత ఇంటికి చేరుకున్న చరణ్ డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడంతో అతని కుటుంబ సభ్యులు, అతని స్నేహితులు షాక్ అయ్యారు. సంవత్సరం క్రితం ప్రేమించిన ప్రియుడు మోసం చేశాడని చరణ్ సోదరి కూడా ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications